నూతన ఉపాధ్యాయులకు శిక్షణ
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:29 AM
భావిభారత పౌరులైన విద్యార్థులను అభివృద్ధి మార్గంలో నడిపించాల్సిన గురుతర బాధ్యత గురువులదే. అందుకు ముందుగా ఉపాధ్యాయులు అన్నివిధాలైన పరిజ్ఞానాన్ని, మెలకువలు అవసరం. ఈ దిశగా నూతన ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకుగాను వృత్తిపరమైన శిక్షణ ఇస్తున్నారు. తద్వారా బోధనకు పదును పెడుతున్నారు.
భావిభారత పౌరులైన విద్యార్థులను అభివృద్ధి మార్గంలో నడిపించాల్సిన గురుతర బాధ్యత గురువులదే. అందుకు ముందుగా ఉపాధ్యాయులు అన్నివిధాలైన పరిజ్ఞానాన్ని, మెలకువలు అవసరం. ఈ దిశగా నూతన ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకుగాను వృత్తిపరమైన శిక్షణ ఇస్తున్నారు. తద్వారా బోధనకు పదును పెడుతున్నారు.
- తిరుపతి(విద్య), ఆంధ్రజ్యోతి
మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను నిజమైన ఉపాధ్యాయులుగా పూర్తిస్థాయిలో తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం వృత్తి శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించింది. బోధన, అభ్యసన అంశాల్లో శిక్షణ ఇప్పిస్తోంది. విజయవాడ నుంచి వచ్చిన రిసోర్స్ పర్సన్లు 10 రోజులపాటు (ఈనెల 10వ తేదీ వరకు) శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నూతన ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడిని జయించేందుకు ఉదయం 6-7 గంటల వరకు యోగా, ఆసనాలపై శిక్షణ ఇస్తున్నారు. 7-8 గంటలమధ్య వ్యక్తిత్వ వికాసంకు సంబంధించిన అంశాలను బోధిస్తున్నారు. విద్యార్థి సమగ్ర మూర్తిమత్వం, విద్యార్థుల్లో నైతికత పెంపొందించడం, స్థిరమైన జీవితాన్ని ప్రోత్సహించడం, సమాజంపై అవగాహన కల్పిండం తోపాటు విద్యార్థి శారీరక అభివృద్ధి, మేధోభివృద్ధి, భాషాభివృద్ధి, సామాజిక సాంస్కృతిక కళాభివృద్ధిని పెంపొందించడానికి అవసరమైన నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తున్నారు. 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర విద్యాశాఖ ఎస్‌ఈఆర్టీ రూపొందించిన బోధనా విధానాలకు సంబంధించిన పుస్తకాలను, ఎప్‌ఎల్‌ఎన్ విధనాలు, టీఏఆర్‌ఎల్ విధానాలకు సంబంఽధించిన అంశాలపై శిక్షణ ఉంటోంది. బోధనా అభ్యసన సామగ్రిని తయారు చేయించడం, వాటి ఆధారంగా సులభ బోధన ఎలా చేయాలనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఉపాధ్యాయులుగా పాఠశాలల్లో నిర్వహించాల్సిన రిజిస్టర్లు, రికార్డులు, పాఠ్య, బోధన, తరగతి నిర్వహణ, తల్లిదండ్రుల సమావేశాలు, మధ్యాహ్న భోజన పథకాల నిర్వహణ, పాఠశాల పరిశుభ్రత, పాఠశాలల్లో నిర్వహించాల్సిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలతో సమగ్రంగా ఈ వృత్తిపరమైన శిక్షణ సాగుతోంది. ఈ శక్షణా కార్యక్రమంతో నూతన ఉపాధ్యాయులు సరికొత్తగా ప్రభావవంతమైన ఉపాధ్యాయులుగా అవతరించనున్నారు. అనంతరం వీరికి మళ్లీ వేసవి సెలవుల్లో రెండో దఫా శిక్షణ ఇవ్వనున్నారు.
ఆరు కేంద్రాల్లో శిక్షణ
ఫ తిరుపతి రూరల్ దుర్గసముద్రం మెడ్జ్‌స్కూల్‌లో 450 మంది ఎస్జీటీలకు శిక్షణ సాగుతోంది. వేదాంతపురం ఢిల్లిపబ్లిక్ స్కల్‌లో 213 మంది ఫిజికల్‌సైన్స్, మైనర్ మీడియంలకు చెందిన స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇస్తున్నారు. తిరుపతి జీవకోనలోని విశ్వం పాఠశాలలో 250 ఎస్జీటీలకు, గూడూరు ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలలో 222 మంది ఎస్జీటీలకు మొత్తం 1135 మంది నూతన ఉపాధ్యాయులకు తిరుపతి జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో శిక్షణ తరగతులు సాగుతున్నాయి. అలాగే చిత్తూరులో శ్రీవెంకటేశ్వర ఫార్మశీ కళాశాలలో భాషా శాస్త్రాలకు చెందిన 152 మంది స్కూల్ అసిస్టెంట్లకు.. ఆర్కే ఇంటర్నేషనల్ స్కూల్లో గణితం, బయాలజీ, సోషల్, ఫిజికల్‌సైన్స్‌కు చెందిన 160 మంది స్కూల్ అసిస్టెంట్ల శిక్షణ ఇస్తున్నారు. వీరికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో కేవీఎన్ కుమార్ తెలిపారు. అవసరమైన మెటీరియల్, అభ్యసన సామగ్రి అందించామన్నారు.