Share News

శబరిమలై యాత్రలో విషాదం

ABN , Publish Date - Dec 04 , 2025 | 01:30 AM

శబరిమలైకు వెళ్లిన తండ్రీకుమారులు కారు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మండలంలోని కారణి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వేణు(48) బేల్దారి కూలీ. కుమారుడు నరేష్‌(30) డ్రైవర్‌. వేణు, నరేష్‌, ఆయన కుమార్తె చాతుర్య అయ్యప్పస్వామి దీక్ష చేపట్టారు. ఈ నెల ఒకటో తేదీ ఉదయం వేణు, నరేష్‌, చాతుర్య(9)తో పాటు వరదయ్యపాళెం మండలం గోవర్ధనపురానికి చెందిన మునితేజ కారణి గ్రామం నుంచి కారులో శబరిమలై అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో తమిళనాడు రాష్ట్రంలోని తేని పట్టణ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. డ్రైవింగ్‌ చేస్తున్న నరేష్‌, పక్కనే కూర్చున్న వేణు అక్కడికక్కడే మృతి చెందారు. మునితేజకు రెండు కాళ్లు విరిగిపోగా, చాతుర్యకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాలకు తేని పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మునితేజ అక్కడే చికిత్స పొందుతున్నాడు. గురువారం మృతదేహాలు కారణి గ్రామానికి వస్తాయని తెలిపారు.

శబరిమలై యాత్రలో విషాదం
వేణు మృతదేహం

ఫ కారు ప్రమాదంలో తండ్రీకుమారుల మృతి

బుచ్చినాయుడుకండ్రిగ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): శబరిమలైకు వెళ్లిన తండ్రీకుమారులు కారు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మండలంలోని కారణి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వేణు(48) బేల్దారి కూలీ. కుమారుడు నరేష్‌(30) డ్రైవర్‌. వేణు, నరేష్‌, ఆయన కుమార్తె చాతుర్య అయ్యప్పస్వామి దీక్ష చేపట్టారు. ఈ నెల ఒకటో తేదీ ఉదయం వేణు, నరేష్‌, చాతుర్య(9)తో పాటు వరదయ్యపాళెం మండలం గోవర్ధనపురానికి చెందిన మునితేజ కారణి గ్రామం నుంచి కారులో శబరిమలై అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో తమిళనాడు రాష్ట్రంలోని తేని పట్టణ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. డ్రైవింగ్‌ చేస్తున్న నరేష్‌, పక్కనే కూర్చున్న వేణు అక్కడికక్కడే మృతి చెందారు. మునితేజకు రెండు కాళ్లు విరిగిపోగా, చాతుర్యకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాలకు తేని పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మునితేజ అక్కడే చికిత్స పొందుతున్నాడు. గురువారం మృతదేహాలు కారణి గ్రామానికి వస్తాయని తెలిపారు.

Updated Date - Dec 04 , 2025 | 01:30 AM