అమ్మవారి దర్శనానికి తోపులాట
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:23 AM
తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.
తిరుచానూరు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో ఆలయ పరిసరాల్లో రద్దీ కనిపించింది. మధ్యాహ్నం మూడో నెంబరు గేటు వద్ద టిక్కెట్ల కోసం భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో క్యూలైన్‌లో తోపులాట జరిగింది. క్యూలైను నుంచి భక్తులు వెలుపలకు వచ్చారు. దీంతో కాసేపు క్యూలైన్‌లో గందరగోళం ఏర్పడింది. సర్వదర్శనానికి గంటకుపైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. వేచి ఉండేందుకు వసతి గృహం లేకపోవడంతో అమ్మవారి నైవేద్యం సమర్పించిన తరువాత ఒకసారిగా భక్తులను క్యూలైన్లలోకి పంపించారు. దీంతో తోపులాట జరిగి భక్తులు ఇబ్బంది పడ్డారు. చిన్నారులు, వృద్ధులతో వచ్చిన భక్తుల అవస్థలు వర్ణనాతీతం. కొందరు గేట్లు దూకి బయటకు వచ్చారు. లడ్డుకౌంటర్ వద్దా రద్దీ కనిపించింది.ఇలాంటి సమయాల్లో అదనపు విజిలెన్సు సిబ్బందిని పర్యవేక్షణకు నియమిస్తే తోపులాటను నియంత్రించవచ్చు.