తిరుపతిలో నేడు గురుపూజోత్సవం
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:33 AM
తిరుపతిలోని కచ్చపి స్టేడియంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు గురుపూజోత్సవం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 62 మందికి.. ఆరుగురు ఎంఈవోలకు పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు డీఈవో కేవీఎన్ కుమార్ గురువారం తెలిపారు.
68 మందికి జిల్లా ఉత్తమ పురస్కారాల ప్రదానం
తిరుపతి(విద్య), సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని కచ్చపి స్టేడియంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు గురుపూజోత్సవం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 62 మందికి.. ఆరుగురు ఎంఈవోలకు పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు డీఈవో కేవీఎన్ కుమార్ గురువారం తెలిపారు. కలెక్టర్ వెంకటేశ్వర్ తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కమిషనర్ తదితర అధికారులు, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.