నేడు ‘అన్నదాత సుఖీభవ’
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:53 PM
రెండో విడత అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు బుధవారం నగదు జమ కానున్నట్లు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు.
తిరుపతి(కలెక్టరేట్/ఎంఆర్‌పల్లె), నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రెండో విడత అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు బుధవారం నగదు జమ కానున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. ‘జిల్లాలో 1,54,908 మంది రైతులకు రూ.104కోట్లు జమ కానుంది. పీఎం కిసాన్ నగదు జమను ప్రధాని మోదీ.. అన్నదాత సుఖీభవ నగదు జమను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. రైతు సేవా కేంద్రాల్లో రైతులు ఈ కార్యక్రమాలను వీక్షించేలా చర్యలు తీసుకోవాలి. జిల్లాలో 8వేల టన్నుల యూరియా నిల్వ ఉంది. ఎకరాకు మూడు బస్తాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’ అని అన్నారు.