నేడు, రేపు భానుడి భగభగలు
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:38 AM
జిల్లావ్యాప్తంగా శని, ఆదివారాల్లో భానుడి భగభగలు జనాన్ని ఠారెత్తించనున్నాయి. శుక్రవారం జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా అనిపించినప్పటికీ వాతావరణ శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం ఏ మండలంలోనూ ఎండ వేడిమి 40 డిగ్రీలకు చేరలేదు.

నేడు మూడు చోట్ల 41 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు.. మరో 14 మండలాల్లో 40కిపైగా
రేపు ఎనిమిది మండలాల్లో అదే పరిస్థితి
తిరుపతి, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా శని, ఆదివారాల్లో భానుడి భగభగలు జనాన్ని ఠారెత్తించనున్నాయి. శుక్రవారం జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా అనిపించినప్పటికీ వాతావరణ శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం ఏ మండలంలోనూ ఎండ వేడిమి 40 డిగ్రీలకు చేరలేదు.
నేడు: జిల్లాలోని మొత్తం 34 మండలాలకు గానూ సగం అంటే 17 మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు శనివారం 40 డిగ్రీలు దాటనున్నాయి. ముఖ్యంగా గూడూరు, బాలాయపల్లి, ఓజిలి మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. గూడూరులో 41.3 డిగ్రీలు, బాలాయపల్లి, ఓజిలి మండలాల్లో 41 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే దొరవారిసత్రం, నాయుడుపేట, పెల్లకూరు మండలాల్లో 40.9 డిగ్రీలు వంతున, చిట్టమూరు, సూళ్లూరుపేట మండలాల్లో 40.7 డిగ్రీలు, బీఎన్ కండ్రిగ, చిల్లకూరు, తొట్టంబేడు మండలాల్లో 40.6 డిగ్రీలు, డక్కిలి, వరదయ్యపాలెం, వెంకటగిరి మండలాల్లో 40.5 డిగ్రీలు, సత్యవేడులో 40.3, శ్రీకాళహస్తి, వాకాడు మండలాల్లో 40.1 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సంబంధిత శాఖ అంచనా వేసింది.
రేపు: జిల్లాలో ఆదివారం కూడా ఎనిమిది మండలాల్లో వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మండలాల వారీగా చూస్తే.. గూడూరులో 40.8 డిగ్రీలు, బాలాయపల్లిలో 40.7, ఓజిలి, డక్కిలి మండలాల్లో 40.4 డిగ్రీలు, వెంకటగిరిలో 40.3, తొట్టంబబేడు, పెళ్ళకూరు మండలాల్లో 40.2 డిగ్రీలు, నాయుడుపేటలో 40 డిగ్రీలు వంతున పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. నడి వేసవి మొదలు కావడంతో పగటి ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, వడగాడ్పులు వంటివి పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజానీకం ముందు జాగ్రత్త పాటించాల్సిన అవసరముంది.