తిరుపతి మహానగరం..!
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:24 AM
తిరుపతి మహానగరానికి శుక్రవారం తొలి అడుగు పడింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గ్రేటర్ ప్రతిపాదనకు సభ్యులు ఏకగ్రీవంగా జైకొట్టారు. కౌన్సిల్ ఆమోదించిన తీర్మాన ప్రతులను, విలీన ప్రతిపాదనలను కలెక్టర్ శుక్రవారమే సంబంధిత పంచాయతీల కార్యదర్శులకు పంపించారు. ఆయా పంచాయతీల నుంచీ విలీన తీర్మానాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఏది ఏమైనా డిసెంబరు నెలాఖరులోపు గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మొత్తమ్మీద ఈ ఏడాది ప్రారంభంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం చేపట్టిన కసరత్తు ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చింది. సీఎం చొరవతో ముందడుగు సంస్కరణలకు, దార్శనికతకు పేరుపడిన సీఎం చంద్రబాబు తిరుపతి నగర అభివృద్ధిపై తొలి నుంచీ శ్రద్ధాసక్తులు చూపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో నారావారిపల్లికి వచ్చిన సందర్భంలో జిల్లా అభివృద్ధిపై కలెక్టర్‌కు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అందులో గ్రేటర్ తిరుపతి ఒకటి. అప్పట్నుంచి జిల్లా యంత్రాంగం దీనిపై కసరత్తు ప్రారంభించింది. భౌగోళికంగా ప్రజలకు గానీ, అధికార యంత్రాంగానికి గానీ అసౌకర్యం కలగని రీతిలో తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల పరిధిలోని 53 పంచాయతీలకు సంబంధించిన 63 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్ తిరుపతిలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
సీఎం ఆదేశాలతో గ్రేటర్ ప్రతిపాదన
కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానంతో తొలి అడుగు
ఆయా పంచాయతీలకు తీర్మాన ప్రతులు పంపిన కలెక్టర్
వాటి నుంచీ తీర్మానాలు రాగానే ప్రభుత్వానికి ప్రతిపాదనలు
డిసెంబరు ఆఖరులోగా నోటిఫికేషన్ జారీకి ప్రయత్నాలు
సీఎం ఆదేశాలతో ఫలిస్తున్న జిల్లా యంత్రాంగం కసరత్తు
తిరుపతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతి మహానగరానికి శుక్రవారం తొలి అడుగు పడింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గ్రేటర్ ప్రతిపాదనకు సభ్యులు ఏకగ్రీవంగా జైకొట్టారు. కౌన్సిల్ ఆమోదించిన తీర్మాన ప్రతులను, విలీన ప్రతిపాదనలను కలెక్టర్ శుక్రవారమే సంబంధిత పంచాయతీల కార్యదర్శులకు పంపించారు. ఆయా పంచాయతీల నుంచీ విలీన తీర్మానాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఏది ఏమైనా డిసెంబరు నెలాఖరులోపు గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మొత్తమ్మీద ఈ ఏడాది ప్రారంభంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం చేపట్టిన కసరత్తు ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చింది.
సీఎం చొరవతో ముందడుగు
సంస్కరణలకు, దార్శనికతకు పేరుపడిన సీఎం చంద్రబాబు తిరుపతి నగర అభివృద్ధిపై తొలి నుంచీ శ్రద్ధాసక్తులు చూపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో నారావారిపల్లికి వచ్చిన సందర్భంలో జిల్లా అభివృద్ధిపై కలెక్టర్‌కు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అందులో గ్రేటర్ తిరుపతి ఒకటి. అప్పట్నుంచి జిల్లా యంత్రాంగం దీనిపై కసరత్తు ప్రారంభించింది. భౌగోళికంగా ప్రజలకు గానీ, అధికార యంత్రాంగానికి గానీ అసౌకర్యం కలగని రీతిలో తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల పరిధిలోని 53 పంచాయతీలకు సంబంధించిన 63 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్ తిరుపతిలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అనూహ్యంగా మారనున్న తిరుపతి రూపురేఖలు
గ్రేటర్‌గా మారితే తిరుపతి నగర రూపురేఖలు అనూహ్యంగా మారిపోనున్నాయి. ఇపుడు కేవలం 30 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన తిరుపతి.. 284 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. 4.50 లక్షల జనాభా 7.50 లక్షలకు పెరగనుంది. రూ.149 కోట్లుగా ఉన్న వార్షికాదాయం రూ.182 కోట్లకు చేరనుంది. చంద్రగిరి, రేణిగుంట వంటి మేజర్ పంచాయతీ కేంద్రాలు తిరుపతిలో అంతర్భాగం కావడంతో పాటు విమానాశ్రయం వెలుపలున్న వికృతమాల దాకా నగరం విస్తరించనుంది.
చంద్రగిరి పంచాయతీలతో అభ్యంతరాలు
చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాలకు చెందిన పంచాయతీలు తిరుపతి కార్పొరేషన్‌లో విలీనం కావడం పట్ల ఎమ్మెల్యే పులివర్తి నానీకి అభ్యంతరమేమీ లేదని సమాచారం. తిరుపతి అభివృద్ధి పట్ల ఆయనకూ ఆసక్తి ఉందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే రాజకీయ కోణం నుంచి చూసినప్పుడు పంచాయతీల విలీనం కారణంగా ఆయనపై స్థానిక నేతల నుంచీ తీవ్ర ఒత్తిడి ఎదరు కానుంది. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్పంచు పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు తాజాగా గ్రేటర్ ప్రతిపాదనలు రావడంతో నిస్పృహ చెందుతున్నట్టు చెబుతున్నారు. ఈ కారణంగానే చంద్రగిరి నియోజకవర్గంలోని పంచాయతీల విలీనం పట్ల ఎమ్మెల్యే నానీ కొంత అయిష్టంగా ఉన్నట్లు సమాచారం. అయితే సీఎం చంద్రబాబు ఆసక్తి, ఆదేశాల నేపథ్యంలో ఆయన పార్టీ నేతలను సమాధానపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.