తిరుపతి - షిర్డీ వీక్లీ రైలు ప్రారంభం
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:07 AM
తిరుపతి, సాయినగర్ షిర్డీ.. ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య అనుసంధానం పెరిగేలా, భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలును ప్రారంభించారు. ఢిల్లీ నుంచి మంగళవారం కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి.సోమన్న వర్చువల్‌గా ప్రారంభించగా, తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు.
తిరుపతి, సాయినగర్ షిర్డీ.. ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య అనుసంధానం పెరిగేలా, భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలును ప్రారంభించారు. ఢిల్లీ నుంచి మంగళవారం కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి.సోమన్న వర్చువల్‌గా ప్రారంభించగా, తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. అదే సమయంలో తిరుపతిలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దనరెడ్డి, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణచక్రవర్తి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీటీడీ సభ్యుడు జి.భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్‌సీ మునికృష్ణ, తుడా మాజీ చైర్మన్ జి.నరసింహయాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు, రైల్వే సీఈ సూర్యనారాయణ, స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, డిప్యూటీ సీఈ వామనమూర్తి, సీపీఆర్‌వో ఎ.శ్రీధర్, ఎస్‌ఎంఆర్ డాక్టర్ కె.చిన్నప రెడ్డి, ఐపీఎఫ్ సందీ్‌పకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఎన్నో రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నామని, ప్రధానంగా విజయవాడ- గూడూరు మధ్య మూడో రైలు మార్గం పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి సోమన్న వెల్లడించారు. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు రూ.312 కోట్లతో జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్,గూడూరు-రేణిగుంట మూడ వ లైను, నడుకుడి-శ్రీకాళహస్తి రైలు మార్గాల పనులు జరుగుతున్నాయని వివరించారు.
- తిరుపతి(సెంట్రల్), ఆంధ్రజ్ర్యోతి