Share News

తిరుపతికి ‘స్వచ్ఛ’ అవార్డు

ABN , Publish Date - Oct 04 , 2025 | 02:18 AM

రుపతి నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా నగరాల పరిశుభ్రతను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ అవార్డును మున్సిపాలిటీలకు అందిస్తుంటోంది. ఇందులో భాగంగా స్పెషల్‌ కేటగిరీకింద స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు తిరుపతి ఎంపికైంది. ఇటీవల సూపర్‌ స్వచ్ఛ్‌ లీగ్‌ కేటగిరీలో 3 లక్షల జనాభా కలిగిన నగరాల్లో తిరుపతి అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈసారి స్పెషల్‌ కేటగిరీ కింద ఈసారి అవార్డు దక్కడంపై కార్పొరేషన్‌ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమష్టి కృషితోనే స్వచ్ఛ అవార్డులు అందుకుంటున్నామని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు కమిషనర్‌ మౌర్య చెప్పారు.

తిరుపతికి ‘స్వచ్ఛ’ అవార్డు

తిరుపతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా నగరాల పరిశుభ్రతను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ అవార్డును మున్సిపాలిటీలకు అందిస్తుంటోంది. ఇందులో భాగంగా స్పెషల్‌ కేటగిరీకింద స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు తిరుపతి ఎంపికైంది. ఇటీవల సూపర్‌ స్వచ్ఛ్‌ లీగ్‌ కేటగిరీలో 3 లక్షల జనాభా కలిగిన నగరాల్లో తిరుపతి అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈసారి స్పెషల్‌ కేటగిరీ కింద ఈసారి అవార్డు దక్కడంపై కార్పొరేషన్‌ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమష్టి కృషితోనే స్వచ్ఛ అవార్డులు అందుకుంటున్నామని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు కమిషనర్‌ మౌర్య చెప్పారు.

Updated Date - Oct 04 , 2025 | 02:18 AM