Share News

జోరుగా హుషారుగా తిరుపతి బాలోత్సవం..!

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:40 AM

బడిలో చదువుల్లో మునిగిపోయిన విద్యార్థులు తిరుపతి బాలోత్సవంలో భాగంగా సాంస్కృతిక ప్రతిభా పోటీల్లో అదరహో అనిపించారు. తమలోని సుకుమార భావాలను వ్యక్తం చేసి ఆహూతులను మైమరిపించారు. ముద్దుముద్దుగా పద్యాలు, పాటలు, నాట్యం చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. శనివారం తిరుపతిలోని ఎస్జీఎస్‌ కాలేజీలో నాల్గవ తిరుపతి బాలోత్సవం ప్రారంభమైంది. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

జోరుగా హుషారుగా తిరుపతి బాలోత్సవం..!

సాంస్కృతిక పోటీలు, ప్రదర్శనలతో అలరించిన చిన్నారులు

వీక్షించి, అభినందించిన కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

బడిలో చదువుల్లో మునిగిపోయిన విద్యార్థులు తిరుపతి బాలోత్సవంలో భాగంగా సాంస్కృతిక ప్రతిభా పోటీల్లో అదరహో అనిపించారు. తమలోని సుకుమార భావాలను వ్యక్తం చేసి ఆహూతులను మైమరిపించారు. ముద్దుముద్దుగా పద్యాలు, పాటలు, నాట్యం చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. శనివారం తిరుపతిలోని ఎస్జీఎస్‌ కాలేజీలో నాల్గవ తిరుపతి బాలోత్సవం ప్రారంభమైంది. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వేలాది మంది విద్యార్థులతో సందడిగా సాగుతున్న ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రంతో ముగియనుంది. తమ ప్రతిభతో విద్యార్థులు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను కూడా మంత్రముగ్దులను చేశారు. చిన్నారుల ఉత్సాహం చూస్తుంటే తనకూ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని అన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 12:40 AM