స్పోర్ట్స్ సిటీగా తిరుపతి
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:28 AM
తిరుపతిని స్పోర్ట్స్ సిటీగా మారుస్తాం. ఇప్పటికే స్పోర్ట్స్ సెంటర్‌కోసం దామినేడు దగ్గర 30 ఎకరాలు కేటాయించాం అని రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం ‘అమరావతి ఛాంపియన్‌షి్‌ప’ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను మంత్రి ప్రారంభించారు. డీఎస్సీలో అర్హత సాధించిన 18వేల మందిలో దాదాపు 450 మందికి క్రీడా కోటల్లో టీచర్ ఉద్యోగాలు దక్కాయని గుర్తుచేశారు. ఎక్కడా రాజీపడకుండా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. తన తండ్రి (రామ్మూర్తి నాయుడు) ఆలిండియా కబడ్డీ చైర్మన్‌గా చేశారని, పెదనాన్న (చంద్రబాబు) స్పోర్ట్స్‌కు పెద్దపీట వేస్తుంటారని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. ఇక్కడి క్రీడాకారులు దేశానికి పతకాలు తీసుకొచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గతంలో స్పోర్ట్స్ డే అంటే ర్యాలీ చేసి, ఒకరిద్దరి ఆటగాళ్లకు సన్మానాలు చేసి ముగించేవారని శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు. ఈసారి మంత్రి చొరవతో అమరావతి చాంపియన్‌షి్‌ప పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మూడు రోజులపాటు నిర్వహించే పోటీలకు దాదాపు 1,300 మంది క్రీడాకారులు వచ్చారని శాప్ ఎండీ గిరీషా అన్నారు. అమరావతి చాంపియన్‌షి్‌పను రెగ్యులర్ ఈవెంట్‌గా మార్చేందుకు శాప్ తీర్మానం చేసిందన్నారు. గ్రామీణ క్రీడాకారులను వెలికితీయాలనే లక్ష్యంతో ఇలాంటి ఛాంపియన్‌షి్‌ప ఫోటీలు నిర్వహిస్తున్నారని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. తుడా ఛైర్మన్ దివాకర్‌రెడ్డి, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, హస్తకళల కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, క్రీడాకారిణి రజిని, డీఎ్‌ససీవో శశిథర్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, టీడీపీ నాయకులు చల్లా బాబు, బీఎల్ సంజయ్, మహేష్ యాదవ్, మన్నెం శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
30 ఎకరాల కేటాయింపు
అమరావతి ఛాంపియన్‌షి్‌ప’ క్రీడా పోటీల ప్రారంభోత్సంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి
తిరుపతి/తిరుపతి (క్రీడలు), ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతిని స్పోర్ట్స్ సిటీగా మారుస్తాం. ఇప్పటికే స్పోర్ట్స్ సెంటర్‌కోసం దామినేడు దగ్గర 30 ఎకరాలు కేటాయించాం అని రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివారం ‘అమరావతి ఛాంపియన్‌షి్‌ప’ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను మంత్రి ప్రారంభించారు. డీఎస్సీలో అర్హత సాధించిన 18వేల మందిలో దాదాపు 450 మందికి క్రీడా కోటల్లో టీచర్ ఉద్యోగాలు దక్కాయని గుర్తుచేశారు. ఎక్కడా రాజీపడకుండా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. తన తండ్రి (రామ్మూర్తి నాయుడు) ఆలిండియా కబడ్డీ చైర్మన్‌గా చేశారని, పెదనాన్న (చంద్రబాబు) స్పోర్ట్స్‌కు పెద్దపీట వేస్తుంటారని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. ఇక్కడి క్రీడాకారులు దేశానికి పతకాలు తీసుకొచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గతంలో స్పోర్ట్స్ డే అంటే ర్యాలీ చేసి, ఒకరిద్దరి ఆటగాళ్లకు సన్మానాలు చేసి ముగించేవారని శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు. ఈసారి మంత్రి చొరవతో అమరావతి చాంపియన్‌షి్‌ప పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. మూడు రోజులపాటు నిర్వహించే పోటీలకు దాదాపు 1,300 మంది క్రీడాకారులు వచ్చారని శాప్ ఎండీ గిరీషా అన్నారు. అమరావతి చాంపియన్‌షి్‌పను రెగ్యులర్ ఈవెంట్‌గా మార్చేందుకు శాప్ తీర్మానం చేసిందన్నారు. గ్రామీణ క్రీడాకారులను వెలికితీయాలనే లక్ష్యంతో ఇలాంటి ఛాంపియన్‌షి్‌ప ఫోటీలు నిర్వహిస్తున్నారని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. తుడా ఛైర్మన్ దివాకర్‌రెడ్డి, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, హస్తకళల కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, క్రీడాకారిణి రజిని, డీఎ్‌ససీవో శశిథర్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, టీడీపీ నాయకులు చల్లా బాబు, బీఎల్ సంజయ్, మహేష్ యాదవ్, మన్నెం శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పోటా పోటీగా..
మంత్రితో పాటు పలువురు అతిథులు డమ్మీ గన్‌పేల్చి అథ్లెటిక్స్‌ను ప్రారంభించారు. వివిధ వేదికలలో ఏర్పాటుచేసిన క్రీడలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఎస్వీయూ మైదానంలో అథ్లెటిక్స్, ఖోఖో.. ఎస్వీయూ క్యాంపస్ గ్రౌండ్‌లో బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాస్కెట్‌బాల్.. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ క్యాంప్‌సస్కూల్ గ్రౌండ్‌లో వాలీబాల్, ఆర్చరీ.. శ్రీనివాస క్రీడా సముదాయంలో కబడ్డీ, బ్యాడ్మింటన్.. ఎస్వీఆర్ట్స్ కాలేజీ మైదానంలో హాకీ పోటీలు జరిగాయి. ఎస్వీయూ ప్రాంతమంతా క్రీడాకారులతో కళకళలాడింది.