తగ్గిన తిరుమల హుండీ ఆదాయం
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:58 AM
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం బుఽధవారం ధ్వజారోహణం రోజున బాగా తగ్గింది.
తిరుమల, సెప్టెంబరు26(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం బుఽధవారం ధ్వజారోహణం రోజున బాగా తగ్గింది. ఉపరాష్ట్రపతి, సీఎం సహా వీవీఐపీలు చాలా మంది తిరుమలలో ఉన్న ఆరోజు భక్తుల సంఖ్య 58వేలు మాత్రమే. గురువారం పరకామణి లెక్కింపులో రూ.1.74 కోట్లు లభించింది. గత రెండేళ్లలో ఒకేరోజు ఇంత తక్కువ హుండీ ఆదాయం ఇదే మొదటిది.