బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:18 AM
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంమంత్రి అనిత టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసు అఽధికారులను ఆదేశించారు. ఆదివారం తిరుమలలోని రచన గెస్ట్‌హౌ్‌సలో టీటీడీ విజిలెన్స్ సీవీఎస్వో మురళీకృష్ణ, ఏఎస్పీ రామకృష్ణ, ఇతర అధికారులతో బ్రహ్మోత్సవ భద్రతాఏర్పాట్లపై సమీక్షించారు.
ఆదేశించిన హోంమంత్రి
తిరుమల, సెప్టెంబరు14(ఆంధ్రజ్యోతి): శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంమంత్రి అనిత టీటీడీ విజిలెన్స్, జిల్లా పోలీసు అఽధికారులను ఆదేశించారు. ఆదివారం తిరుమలలోని రచన గెస్ట్‌హౌ్‌సలో టీటీడీ విజిలెన్స్ సీవీఎస్వో మురళీకృష్ణ, ఏఎస్పీ రామకృష్ణ, ఇతర అధికారులతో బ్రహ్మోత్సవ భద్రతాఏర్పాట్లపై సమీక్షించారు. ఇప్పటికే చేపట్టిన ఏర్పాట్ల గురించి అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బందోబస్తు,ట్రాఫిక్ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని విజిలెన్స్, పోలీసు విధులు నిర్వహించాలన్నారు. భక్తులతో మర్యాదపూర్వకంగా మెలిగేలా సిబ్బందికి సూచనలు చేయాలన్నారు. ప్రతి కదలికలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలన్నారు. సమీక్షలో డీఎస్పీ విజయ్‌శేఖర్, వీఎస్వోలు రామ్‌కుమార్, సురేంద్ర, సీఐలు విజయ్‌కుమార్, శ్రీరాముడు తదితరులు పాల్గొన్నారు.