టైగర్ రొయ్యకు ‘వైట్‌స్పాట్’
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:49 AM
వైట్‌స్పాట్ వైరస్ ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రొయ్యలను పట్టేసి విక్రయిద్దామనుకుంటున్న తరుణంలో అల్పపీడన ద్రోణి కారణంగా విపరీతమైన చలితో పాటు మంచు కురుస్తోంది. అదే సమయంలో వైట్‌స్పాట్ వైర్‌సతో రొయ్యలు మృత్యువాత పడుతుండటంతో ఆక్వా రైతులు విలవిలలాడుతున్నారు. సముద్రతీర ప్రాంతాలైన చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో టైగర్, వెనామి రొయ్యల పెంపకం చేపట్టారు. వాతావరణంలో మార్పులు, విపరీతమైన మంచు కురుస్తుండటంతో టైగర్ రొయ్యలకు వైట్‌స్పాట్ సోకుతోంది. నీటిలో ఉన్న రొయ్యలకు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండాలి. ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల 11 నుంచి 12 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోవడంతో రొయ్యలు వైరస్ బారిన పడుతున్నాయి. దీంతో రొయ్యలు మేత తినకుండా బరువు తగ్గి చనిపోతున్నట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా కోట మండలంలోని వావిళ్ల దొరువు, శ్రీనివాససత్రం, దొరువుకట్ట, ఉత్తమనెల్లూరు గ్రామాల్లో వైట్‌స్పాట్ ఉన్నట్లు రైతులు చెబుతున్నారు.
కోట, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): వైట్‌స్పాట్ వైరస్ ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రొయ్యలను పట్టేసి విక్రయిద్దామనుకుంటున్న తరుణంలో అల్పపీడన ద్రోణి కారణంగా విపరీతమైన చలితో పాటు మంచు కురుస్తోంది. అదే సమయంలో వైట్‌స్పాట్ వైర్‌సతో రొయ్యలు మృత్యువాత పడుతుండటంతో ఆక్వా రైతులు విలవిలలాడుతున్నారు. సముద్రతీర ప్రాంతాలైన చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో టైగర్, వెనామి రొయ్యల పెంపకం చేపట్టారు. వాతావరణంలో మార్పులు, విపరీతమైన మంచు కురుస్తుండటంతో టైగర్ రొయ్యలకు వైట్‌స్పాట్ సోకుతోంది. నీటిలో ఉన్న రొయ్యలకు 35 డిగ్రీల
ఉష్ణోగ్రతలు ఉండాలి. ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల 11 నుంచి 12 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోవడంతో రొయ్యలు వైరస్ బారిన పడుతున్నాయి. దీంతో రొయ్యలు మేత తినకుండా బరువు తగ్గి చనిపోతున్నట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా కోట మండలంలోని వావిళ్ల దొరువు, శ్రీనివాససత్రం, దొరువుకట్ట, ఉత్తమనెల్లూరు గ్రామాల్లో వైట్‌స్పాట్ ఉన్నట్లు రైతులు చెబుతున్నారు.