ముచ్చటగా మూడు వాహనాలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:20 AM
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం మలయప్పస్వామి మూడువాహనాలపై నాలుగు మాడవీధుల్లో ఊరేగారు.
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం మలయప్పస్వామి మూడువాహనాలపై నాలుగు మాడవీధుల్లో ఊరేగారు. ఉదయం 9 గంటలకు కోదండరాముడిగా హనుమంతవాహనంపై.. సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథంపై.. పట్టాభిషేకానికి వెళ్లే రారాజులా రాత్రి 7 గంటలకు గజవాహనంపై భక్తకోటిని అనుగ్రహించారు. పెరటాశి రెండో శనివారం, ఆదివారం గరుడసేవ సందర్భంగా తిరుమల కిటకిటలాడింది. ఆదివారం అర్ధరాత్రికే చాలా మంది తిరుగు ప్రయాణం కావడంతో రద్దీ సాధారణస్థితికి చేరుకుంది. మరోవైపు తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. అయినా, భక్తులు గ్యాలరీల్లోనే కూర్చుని వాహన సేవలను వీక్షించారు. ఆయా వాహన సేవల్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలలో నేడు
ఉదయం: 8-10 మధ్య సూర్యప్రభ వాహనం
మఽధ్యాహ్నం: 1-3 మధ్య స్నపన తిరుమంజనం
రాత్రి: 7-9మధ్య చంద్రప్రభ వాహనం
- తిరుమల, ఆంధ్రజ్యోతి