సింగపూర్ పర్యటనకు ముగ్గురు ఉపాధ్యాయులు
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:55 AM
ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్ర పురస్కారాలు అందుకున్న ముగ్గురు ఉపాధ్యాయులు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. సింగపూర్ విద్యావ్యవస్థ ప్రపంచ స్థాయిలో ఉత్తమ విద్యావ్యవస్థగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో అత్యుత్తమ విద్యావిధానాలను అధ్యయనంచేసి... వాటిని మన రాష్ట్రంలోకూడా అమలుచేసి మన విద్యావ్యవస్థను మరింత మెరుగుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్ పంపిస్తోంది. ఈ క్రమంలో శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు జడ్పీహెచ్‌ఎ్‌స ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ డాక్టర్ ఎన్.సుబ్రమణ్యశర్మ, తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్యపాళెం ఫౌండేషన్ స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్ కయ్యూరు బాలసుబ్రమణ్యం, శ్రీకాళహస్తి మండలం ఎగువ వీధి జడ్పీహెచ్‌ఎ్‌స ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎస్.రామకృష్ణ సింగపూర్ వెళ్లేవారిలో ఉన్నారు. ఈనెల 27 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు వీరి పర్యటన కొనసాగనుంది. సింగపూర్‌లోని ప్రధాన పాఠశాలల్లో అత్యాధునిక బోధనా విధానాలు, క్లాస్‌రూమ్ వాతరావరణం, టెక్నాలజీ ఆధారిత బోధనా విధానాలు, బోధనేతర పద్ధతులు, కరిక్యులం, తరగతి గదుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం తదితర అంశాలను పరిశీలించి తదుపరి ఆయా అంశాల గురించి, రాష్ట్రంలో ఆయా విధానాలను ఎలా అమలు చేయొచ్చన్న దానిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
తిరుపతి(విద్య), నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్ర పురస్కారాలు అందుకున్న ముగ్గురు ఉపాధ్యాయులు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. సింగపూర్ విద్యావ్యవస్థ ప్రపంచ స్థాయిలో ఉత్తమ విద్యావ్యవస్థగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో అత్యుత్తమ విద్యావిధానాలను అధ్యయనంచేసి... వాటిని మన రాష్ట్రంలోకూడా అమలుచేసి మన విద్యావ్యవస్థను మరింత మెరుగుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్ పంపిస్తోంది. ఈ క్రమంలో శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు జడ్పీహెచ్‌ఎ్‌స ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ డాక్టర్ ఎన్.సుబ్రమణ్యశర్మ, తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్యపాళెం ఫౌండేషన్ స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్ కయ్యూరు బాలసుబ్రమణ్యం, శ్రీకాళహస్తి మండలం ఎగువ వీధి జడ్పీహెచ్‌ఎ్‌స ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎస్.రామకృష్ణ సింగపూర్ వెళ్లేవారిలో ఉన్నారు. ఈనెల 27 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు వీరి పర్యటన కొనసాగనుంది. సింగపూర్‌లోని ప్రధాన పాఠశాలల్లో అత్యాధునిక బోధనా విధానాలు, క్లాస్‌రూమ్ వాతరావరణం, టెక్నాలజీ ఆధారిత బోధనా విధానాలు, బోధనేతర పద్ధతులు, కరిక్యులం, తరగతి గదుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం తదితర అంశాలను పరిశీలించి తదుపరి ఆయా అంశాల గురించి, రాష్ట్రంలో ఆయా విధానాలను ఎలా అమలు చేయొచ్చన్న దానిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.