Share News

ఇంటర్‌ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థుల డీబార్‌

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:38 AM

ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులకు మంగళవారం పరీక్షలు జరిగాయి. వి.కోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పెద్ద పెత్తున మాల్‌ ప్రాక్టీస్‌ జరుగుతుందన్న సమాచారంతో సిట్టింగ్‌ స్క్వాడ్‌తోపాటు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, స్పెషల్‌ అధికారి, డీఈసీ కన్వీనర్‌లు ఏకకాలంలో తనిఖీలు చేశారు. దీంతో కాపీ కొడుతూ ముగ్గురు విద్యార్థులు పట్టబడగా, డీబార్‌ చేసినట్లు డీవీఈవో, డీఈసీ కన్వీనర్‌ సయ్యద్‌ మౌల తెలిపారు. వీరిలో ఇద్దరు జనరల్‌ ఇంటర్‌ విద్యార్థులుండగా, ఒకరు ఒకేషనల్‌ విద్యార్థి. జిల్లావ్యాప్తంగా 50 సెంటర్లలో 17,180 మంది విద్యార్థులకు 16,156 మంది హాజరవగా, 1021 గైర్హాజరైనట్లు డీవీఈవో తెలిపారు. జనరల్‌ ఇంటర్‌లో 15,037 మందికి 14,225 మంది హాజరవగా, 810 గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 2143 మందికి 1931 మంది హాజరవగా, 211 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

ఇంటర్‌ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థుల డీబార్‌

చిత్తూరు సెంట్రల్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులకు మంగళవారం పరీక్షలు జరిగాయి. వి.కోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పెద్ద పెత్తున మాల్‌ ప్రాక్టీస్‌ జరుగుతుందన్న సమాచారంతో సిట్టింగ్‌ స్క్వాడ్‌తోపాటు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, స్పెషల్‌ అధికారి, డీఈసీ కన్వీనర్‌లు ఏకకాలంలో తనిఖీలు చేశారు. దీంతో కాపీ కొడుతూ ముగ్గురు విద్యార్థులు పట్టబడగా, డీబార్‌ చేసినట్లు డీవీఈవో, డీఈసీ కన్వీనర్‌ సయ్యద్‌ మౌల తెలిపారు. వీరిలో ఇద్దరు జనరల్‌ ఇంటర్‌ విద్యార్థులుండగా, ఒకరు ఒకేషనల్‌ విద్యార్థి. జిల్లావ్యాప్తంగా 50 సెంటర్లలో 17,180 మంది విద్యార్థులకు 16,156 మంది హాజరవగా, 1021 గైర్హాజరైనట్లు డీవీఈవో తెలిపారు. జనరల్‌ ఇంటర్‌లో 15,037 మందికి 14,225 మంది హాజరవగా, 810 గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 2143 మందికి 1931 మంది హాజరవగా, 211 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 01:38 AM