Share News

ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లకు పదోన్నతి

ABN , Publish Date - Oct 05 , 2025 | 01:26 AM

జిల్లా పరిషత్‌ (జడ్పీ) పరిధిలో ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ల (ఏవో)గా పదోన్నతి కల్పించి, వారికి స్థానాలను కేటాయిస్తూ శనివారం సీఈవో రవికుమార్‌ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లకు పదోన్నతి

చిత్తూరు రూరల్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ (జడ్పీ) పరిధిలో ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్ల (ఏవో)గా పదోన్నతి కల్పించి, వారికి స్థానాలను కేటాయిస్తూ శనివారం సీఈవో రవికుమార్‌ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. చౌడేపల్లె ఎంపీడీవో కార్యాలయంలోని సీనియర్‌ అసిస్టెంట్‌ సుకన్యను సదుం ఎంపీడీవో కార్యాలయ ఏవోగా, పలమనేరు ఎంపీడీవో కార్యాలయంలోని సీనియర్‌ అసిస్టెంట్‌ శాంతిని పాకాల ఎంపీడీవో కార్యాలయ ఏవోగా, జడ్పీలో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డిని రామచంద్రాపురం ఎంపీడీవో కార్యాలయ ఏవోగా నియమించారు.

Updated Date - Oct 05 , 2025 | 01:26 AM