Share News

ఈ ఏడాది మరో మూడు ప్రయోగాలు

ABN , Publish Date - Aug 16 , 2025 | 01:46 AM

అక్టోబరులో గగన్‌యాన్‌-జీ1 మిషన్‌ డిసెంబరు లోపు ఈవోఎస్‌, బ్లూబర్డ్‌ ఉపగ్రహాలు షార్‌ డైరెక్టర్‌ పద్మకుమార్‌ వెల్లడి

ఈ ఏడాది మరో మూడు ప్రయోగాలు

సూళ్లూరుపేట, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఈ ఏడాది మరో మూడు భారీ ప్రయోగాలు చేపట్టనున్నామని షార్‌ డైరెక్టర్‌ ఈఎస్‌ పద్మకుమార్‌ తెలిపారు. షార్‌లోని భాస్కర అంతరిక్ష నివా్‌సలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అక్టోబరులో గగన్‌యాన్‌-జీ 1 మిషన్‌ ప్రయోగం ఉంటుందని, దీనికి సంబంధించి పనులు షార్‌లో జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది చివరిలోపు ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌ ద్వారా ఈవోఎస్‌ ఉపగ్రహం, ఎల్‌వీఎం3-ఎం6 ద్వారా బ్లూ బర్డ్‌ ఉపగ్రహ ప్రయోగాలు ఉంటాయన్నారు. జూలై 30న జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌ 16 ద్వారా ఇస్రో-నాసా సంయుక్తంగా ప్రయోగించిన నిసార్‌ ఉపగ్రహ పనితీరు బాగుందన్నారు. వచ్చే ఏడాది మొదట్లో పీఎ్‌సఎల్వీ-సీ 62, సీ 63 ప్రయోగాలు ఉంటాయన్నారు. సవాళ్లతో కూడిన ఆ ప్రయోగాలన్నింటికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మూడో ప్రయోగ వేదిక నిర్మాణానికి సంబంధించి డిజైన్‌లో మార్పులు జరుగుతున్నాయని, ఆ తర్వాత టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. చంద్రయాన్‌-4 ప్రయోగానికి సంబంధించి కూడా డిజైన్లు జరుగుతున్నాయన్నారు. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అభివృద్ధి చేసిన విక్రమ్‌ ప్రయోగం విజయవంతం కావడం భారత్‌ అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేట్‌ భాగస్వామ్యం పెరగడానికి దోహదమైందన్నారు. రాబోయే రోజుల్లో ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యంతో మరిన్ని ప్రయోగాలు చేపడతామన్నారు. చంద్రయాన్‌-4, మానవ సహిత ప్రయోగాలతో పాటు అంతరిక్షంలో 2035 కల్లా భారతీయ స్పేస్‌పోర్టు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎ్‌సఏ డిప్యూటీ డైరెక్టర్‌ గోపీకృష్ణ, పబ్లికేషన్‌ పబ్లిసిటీ అధికారి భాస్కరన్‌, సుఽధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 01:46 AM