వరసిద్ధుడి దర్శనానికి మూడు గంటలు
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:59 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అధిక సంఖ్యలో విచ్చేయడటంతో క్యూలైన్లు పూర్తిగా నిండి పోయాయి. దీంతో స్వామి దర్శనానికి మూడు గంటలకుపైగా సమయం పట్టింది.
ఐరాల(కాణిపాకం), డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అధిక సంఖ్యలో విచ్చేయడటంతో క్యూలైన్లు పూర్తిగా నిండి పోయాయి. దీంతో స్వామి దర్శనానికి మూడు గంటలకుపైగా సమయం పట్టింది.ఈ రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది.భక్తులందరికీ సాఫీగా దర్శన సౌకర్యం కల్పించేలా ఆలయ చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షించారు.