ఆ బాంబులు ఎప్పుడైనా పేలొచ్చు
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:59 AM
‘వాష్‌రూములో ఏడు ఆర్డీఎక్స్ ఆధారిత పేలుడు పదార్థాలు పెట్టాం. అవి ఏ సమయంలోనైనా పేలొచ్చు’ అంటూ తిరుపతిలోని వ్యవసాయ కళాశాలకు బుధవారం ఈమెయిల్ వచ్చింది. భయాందోళనకు గురైన అధికారులు వెంటనే తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందుకు సమాచారమిచ్చారు.
వ్యవసాయ కళాశాలకు నాలుగోసారి బెదిరింపు
ఉత్తుత్తిదేనని తేల్చిన పోలీసులు
తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘వాష్‌రూములో ఏడు ఆర్డీఎక్స్ ఆధారిత పేలుడు పదార్థాలు పెట్టాం. అవి ఏ సమయంలోనైనా పేలొచ్చు’ అంటూ తిరుపతిలోని వ్యవసాయ కళాశాలకు బుధవారం ఈమెయిల్ వచ్చింది. భయాందోళనకు గురైన అధికారులు వెంటనే తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందుకు సమాచారమిచ్చారు. పోలీసులు, డాగ్, బాంబు స్క్వాడ్‌లు కళాశాలలోని ప్రిన్సిపల్ సహా అన్నిచాంబర్లు, గదులు, హాస్టళ్లు, చుట్టు పక్కల ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఎక్కడా బాంబులు లేవని, ఫేక్ మెయిల్స్ అని తేల్చారు. కాగా, వ్యవసాయ కళాశాలకే బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం ఇది నాలుగోసారి. తొలుత గతేడాది నవంబరు 17న, డిసెంబరు 18న, ఈ ఏడాది మే 28న, ఇప్పుడు తాజాగా.. వ్యవసాయ కళాశాలకు బెదిరింపులు రావడం గమనార్హం.