Share News

ఇదేం చాకిరీ!

ABN , Publish Date - Jun 26 , 2025 | 01:18 AM

యాదమరి మండల పరిధిలోని కాశిరాళ్ళ గొల్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆపసోపాలు పడుతూ వాటర్‌ క్యాన్లను స్కూలుకు తీసుకెళుతున్న దృశ్యమిది.

ఇదేం చాకిరీ!
ద్విచక్రవాహనంపై పాఠశాలకు మినరల్‌ వాటర్‌ క్యాన్‌ తీసుకెళ్తున్న 9వ తరగతి విద్యార్థులు

యాదమరి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): యాదమరి మండల పరిధిలోని కాశిరాళ్ళ గొల్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆపసోపాలు పడుతూ వాటర్‌ క్యాన్లను స్కూలుకు తీసుకెళుతున్న దృశ్యమిది.9వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థులకు బుధవారం ఓ ద్వితీయశ్రేణి ఉద్యోగి ద్విచక్రవాహనం ఇచ్చి మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నుంచి నీటిని తెప్పించుకున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని సెంట్రల్‌ మోటార్‌ వెహికల్స్‌ చట్టం చెబుతోంది. పాఠశాలలో నిబంధనలను ఉల్లంఘించి విద్యార్థులకు వాహనం ఇచ్చి నీటి సరఫరా చేయించుకోవడం విమర్శలకు తావిస్తోంది. అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Jun 26 , 2025 | 01:18 AM