సచివాలయాల్లోనే సరిపెట్టేశారు
ABN , Publish Date - Apr 07 , 2025 | 01:21 AM
టీడీఆర్ బాండ్ల జారీ స్పెషల్ డ్రైవ్ ఆదివారం కార్పొరేషన్ కార్యాలయంలో జరగలేదు. మాస్టర్ ప్లాన్ రోడ్ల పరిధిలోని కొన్ని సచివాలయాల్లో మాత్రమే నిర్వహించారు. అదీ ప్లానింగ్ సెక్రటరీల ద్వారా బాధితులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆదివారం సెలవైనా టీడీఆర్ బాండ్ల స్పెషల్ డ్రైవ్‌ను పెద్దఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్లానింగ్ అధికారులు చెప్పారు. దరఖాస్తుల పరిశీలన కోసం ఒక బృందం కార్యాలయంలో ఉంటే, మరో బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పలువురు ఉదయం 10.30 గంటలకు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. గంటపాటు వేచిచూశారు. ఇంతలో టౌన్‌ప్లానింగ్ కార్యదర్శులు అక్కడికి చేరుకుని వారిని ఆయా పరిధిలోని సచివాలయాలకు తీసుకెళ్లి డాక్యుమెంట్ల పరిశీలన చేశారు.

నామమాత్రంగా టీడీఆర్ బాండ్ల పరిశీలన

- తిరుపతి, ఆంధ్రజ్యోతి