కత్తులు చేతబట్టి ఫొటోలకు ఫోజులిచ్చి ...
ABN , Publish Date - Dec 27 , 2025 | 01:27 AM
గూడూరు మండలం విందూరు గ్రామంలో వైసీపీ నాయకులు ఈనెల 21వ తేదీ రాత్రి మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ సమయంలో కొందరు యువకులు కత్తులు పైకెత్తి చూపుతూ, టపాసులు పేల్చి కేక్ కట్ చేస్తూ హంగామా చేశారు. అప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలు శుక్రవారం వైరల్ అయ్యాయి. దీనిపై టీడీపీ నేత లాలూప్రసాద్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గూడూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గూడూరు మండలం విందూరు గ్రామంలో వైసీపీ నాయకులు ఈనెల 21వ తేదీ రాత్రి మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ సమయంలో కొందరు యువకులు కత్తులు పైకెత్తి చూపుతూ, టపాసులు పేల్చి కేక్ కట్ చేస్తూ హంగామా చేశారు. అప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలు శుక్రవారం వైరల్ అయ్యాయి. దీనిపై టీడీపీ నేత లాలూప్రసాద్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విందూరు గ్రామానికి చెందిన నలుగురు యువలకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీసులు తెలిపారు.