కాణిపాకం కిటకిట
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:34 AM
కాణిపాక వరసిద్ధి వినాయక స్దామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది.సెలవు రోజు కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు క్యూ కట్టడంతో ఆలయంలోని క్యూలైన్లు పూర్తిగా నిండి పోయి వెలుపల వందల సంఖ్యలో భక్తులు వేచి వుండాల్సివచ్చింది.
ఐరాల(కాణిపాకం), నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధి వినాయక స్దామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది.సెలవు రోజు కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు క్యూ కట్టడంతో ఆలయంలోని క్యూలైన్లు పూర్తిగా నిండి పోయి వెలుపల వందల సంఖ్యలో భక్తులు వేచి వుండాల్సివచ్చింది. శబరిమలకు బయల్దేరిన అయ్యప్ప స్వామి భక్తులు కూడా వరసిద్ధుని ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేశారు.దీంతో స్వామి దర్శనానికి నాలుగు గంటల పైనే సమయం పట్టింది.