Share News

మహిళా పార్లమెంటేరియన్ల సమావేశానికి వేదిక ఖరారు

ABN , Publish Date - Sep 01 , 2025 | 01:55 AM

తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీలల్లో జరగనున్న మహిళా పార్లమెంటేరియన్ల సమావేశానికి తిరుచానూరులోని రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను వేదికగా ఖరారు చేశారు.

మహిళా పార్లమెంటేరియన్ల సమావేశానికి వేదిక ఖరారు

తిరుపతి(కలెక్టరేట్‌), ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీలల్లో జరగనున్న మహిళా పార్లమెంటేరియన్ల సమావేశానికి తిరుచానూరులోని రాహుల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను వేదికగా ఖరారు చేశారు. దేశవ్యాప్తంగా 300మంది మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశాన్ని 14న ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు చంద్రగిరిలో లైటింగ్‌షో వీక్షించనున్నారు. 15వ తేది జరిగే ముగింపు కార్యక్రమానికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరు కానున్నారు. ఆవుతారు. మధ్యాహ్నం తర్వాత మహిళా ప్రతినిఽధులు, శ్రీకాళహస్తి, షార్‌, శ్రీసిటీని సందర్శించున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సదస్సు ఏర్పాట్లను మంగళవారం అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌, ఇతర అధికారులు పరిశీలించనున్నారు. అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు.

Updated Date - Sep 01 , 2025 | 01:55 AM