Share News

‘లక్ష’ణంగా స్త్రీశక్తి వినియోగం

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:27 AM

స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన పదో రోజున జిల్లా వ్యాప్తంగా లక్షకుపైగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ప్రయాణికుల్లో 1,04,810 మంది మహిళలు, 1,101మంది బాలికలు ఉన్నారు. వీరి టికెట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.41.61లక్షలు రీయింబర్స్‌మెంట్‌ రావాల్సివుందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.

 ‘లక్ష’ణంగా స్త్రీశక్తి వినియోగం
మాట్లాడుతున్న ఆర్టీసీ ఈడీ చెంగల్‌రెడ్డి

తిరుపతి(ఆర్టీసీ), ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి):స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన పదో రోజున జిల్లా వ్యాప్తంగా లక్షకుపైగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ప్రయాణికుల్లో 1,04,810 మంది మహిళలు, 1,101మంది బాలికలు ఉన్నారు. వీరి టికెట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.41.61లక్షలు రీయింబర్స్‌మెంట్‌ రావాల్సివుందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. డిపోల వారీగా... 14,399 (గూడూరు), 8,197 (మంగళం), 12,882 (పుత్తూరు), 12,898 (సత్యవేడు), 11,721 (శ్రీకాళహస్తి), 8,201 (సూళ్లూరుపేట), 10,652 (తిరుపతి), 14,107 (వెంకటగిరి), 12854 (వాకాడు) మంది ఒక్కరోజే స్త్రీశక్తి పథకాన్ని వినియోగించుకున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా టిక్కెట్‌ తీసుకుని 1,16,010 మంది బస్సులెక్కరు. వీరి ద్వారా రూ. 1.3కోట్లు రాబడి లభించింది.

స్త్రీ శక్తి విజయవంతంపై అభినందన

స్త్రీ శక్తి పథకం విజయవంతంపై ఏపీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చెంగల్‌రెడ్డి జిల్లా అధికారులను, సిబ్బందిని అభినందించారు. మంగళవారం ఆయన మంగళం ఆర్టీసీ డిపోలో అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకం అంచనాలకు మించి అమలవుతోందన్నారు. ఇదే స్పూర్తితో రాబోవు రోజుల్లో కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా బస్సులు నడపాలని సూచించారు. తిరుమల బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. సమావేశంలో ప్రజారవాణాధికారి జగదీష్‌, డిప్యూటీ సీటీఎం విశ్వనాధం, సీఎంఈ బాలాజీ, డిపోమేనేజర్‌ సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2025 | 12:27 AM