మొదలైన ‘టెన్త్ సప్లిమెంటరీ’ మూల్యాంకనం
ABN , Publish Date - Jun 01 , 2025 | 01:03 AM
జిల్లాలోని 36 పరీక్షా కేంద్రాల్లో ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. వీటికి సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం శనివారం స్థానిక పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీఈవో వరలక్ష్మి, పరీక్షల సహాయ కమిషనర్, ఏఈ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టారు.
చిత్తూరు సెంట్రల్, మే 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 36 పరీక్షా కేంద్రాల్లో ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. వీటికి సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం శనివారం స్థానిక పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీఈవో వరలక్ష్మి, పరీక్షల సహాయ కమిషనర్, ఏఈ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టారు. వివిధ జిల్లాల నుంచి చిత్తూరు జిల్లాకు 10,300 జవాబు పత్రాలు రాగా, వీటిని మూల్యాంకనం చేయడానికి 10 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 140 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లను నియమించారు. మూడు రోజుల పాటు మూల్యాంకనం జరగనుంది.