చారాల చెరువు మొరవ ఉధృతం
ABN , Publish Date - Oct 20 , 2025 | 01:42 AM
చారాల చెరువు మొరవ వుధ్రుతం కావడంతో పంటలు నీటమునిగాయి. శనివారం రాత్రి కురిసిన వర్షానికి మండలంలో పెద్ద చెరువుల్లో ఒకటైన చారాల చెరువు మొరవ పోతోంది. జంగాలపల్లె-చారాల మార్గంలో మొరవ నీళ్ళు వుధ్రుతంగా ప్రవహించడంతో రాక పోకలు బందయ్యాయి. జంగాలపల్లెకు వెళ్ళాలంటే చారాల నుంచి చౌడేపల్లెకు వెళ్లి అక్కడి నుంచి బీర్జేపల్లె మీదుగా సుమారు 10 కిలోమీటర్లు చుట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి నెలకొంది. జంగాలపల్లెకు చెందిన రెడ్డెప్ప ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంలో చౌడేపల్లెకు వెళుతుండగా మొరవనీటిలో కొట్టుకు పోయారు. గమనించిన స్థానికులు ఆయనకు తాడు అందించి రక్షించారు.తాళ్ళసాయంతో ఆయన ద్విచక్రవాహనాన్ని ఒడ్డుకు చేర్చారు.
కొట్టుకుపోయిన ద్విచక్రవాహనం
నీట మునిగిన వరి,వంగ పంటలు
చౌడేపల్లె, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): చారాల చెరువు మొరవ వుధ్రుతం కావడంతో పంటలు నీటమునిగాయి. శనివారం రాత్రి కురిసిన వర్షానికి మండలంలో పెద్ద చెరువుల్లో ఒకటైన చారాల చెరువు మొరవ పోతోంది. జంగాలపల్లె-చారాల మార్గంలో మొరవ నీళ్ళు వుధ్రుతంగా ప్రవహించడంతో రాక పోకలు బందయ్యాయి. జంగాలపల్లెకు వెళ్ళాలంటే చారాల నుంచి చౌడేపల్లెకు వెళ్లి అక్కడి నుంచి బీర్జేపల్లె మీదుగా సుమారు 10 కిలోమీటర్లు చుట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి నెలకొంది. జంగాలపల్లెకు చెందిన రెడ్డెప్ప ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంలో చౌడేపల్లెకు వెళుతుండగా మొరవనీటిలో కొట్టుకు పోయారు. గమనించిన స్థానికులు ఆయనకు తాడు అందించి రక్షించారు.తాళ్ళసాయంతో ఆయన ద్విచక్రవాహనాన్ని ఒడ్డుకు చేర్చారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సుమారు 100 ఎకరాలకు పైగా వరి పంటలు నీట మునిగింది. అలాగే శెట్టిపేట వద్ద వంకాయ తోటతో పాటు, పలువురు రైతులకు చెందిన వరి పంటలు కూడా నీట మునిగాయి.పంట నష్టం అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు ఏవో మోహన్‌కుమార్ తెలిపారు.