Share News

వృషభ వాహనంపై వరసిద్ధుడు

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:48 AM

స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం చిలుక వాహనంపై వినాయకుడు దర్శనమిచ్చారు.

వృషభ వాహనంపై వరసిద్ధుడు

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం చిలుక వాహనంపై వినాయకుడు దర్శనమిచ్చారు. కాణిపాకానికి చెందిన ఆర్యవైశ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. అలాగే రాత్రి నిర్వహించిన వృషభ వాహన సేవకు కాణిపాకం, సంతపల్లె, మారేడుపల్లె, ముదిగోళం, చిత్తూరు ప్రాంతాలకు చెందిన శాలివాహన వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు.రాత్రి వారంతా ఉభయ వరస తీసుకురావడంతో కల్యాణ వేదికపై ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. వృషభ వాహనాన్ని శోభాయమానంగా అలంకరించి సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవ విగ్రహాలను వాహనంపై ఆశీనులను చేసి పురవీధుల్లో ఊరేగించారు. బుధవారం నిర్వహించనున్న రథోత్సవానికి సోమవారం రథ కలశ పూజను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం గజ వాహన సేవను నిర్వహించనున్నారు.

Updated Date - Sep 02 , 2025 | 01:48 AM