మార్కెటింగ్ శాఖకు రూ.66.96 లక్షల ఆదాయం
ABN , Publish Date - Sep 05 , 2025 | 01:54 AM
జిల్లా మార్కెటింగ్ శాఖకు ఏఎంసీల ద్వారా ఆగస్టు నెలలో రూ.66.96 లక్షల ఆదాయం సమకూరినట్లు ఏడీ పరమేశ్వరన్ తెలిపారు. గురువారం ఆయన ఛాంబర్‌లో మాట్లాడుతూ అత్యధికంగా పలమనేరు ఏఎంసీ ద్వారా రూ.32.33 లక్షల ఆదాయం సమకూరగా, అత్యల్పంగా సోమల ఏఎంసీకి కేవలం రూ.33 వేలు మాత్రమే వచ్చింది.
చిత్తూరు సెంట్రల్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లా మార్కెటింగ్ శాఖకు ఏఎంసీల ద్వారా ఆగస్టు నెలలో రూ.66.96 లక్షల ఆదాయం సమకూరినట్లు ఏడీ పరమేశ్వరన్ తెలిపారు. గురువారం ఆయన ఛాంబర్‌లో మాట్లాడుతూ అత్యధికంగా పలమనేరు ఏఎంసీ ద్వారా రూ.32.33 లక్షల ఆదాయం సమకూరగా, అత్యల్పంగా సోమల ఏఎంసీకి కేవలం రూ.33 వేలు మాత్రమే వచ్చింది. మిగిలిన ఏఎంసీల ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరుకు రూ.7.50 లక్షలు, పుంగనూరుకు రూ.7.89 లక్షలు, బంగారుపాళ్యంకు రూ.7.46 లక్షలు, నగరికి రూ.2.57 లక్షలు, కుప్పంకు రూ.6.25 లక్షలు, పెనుమూరుకు రూ.1.23 లక్షలు, రొంపిచెర్లకు రూ.89 వేలు, ఎస్‌ఆర్‌పురంకు రూ.61 వేలు ఆదాయం సమకూరినట్లు తెలిపారు.