ఆలయాల మూత
ABN , Publish Date - Sep 08 , 2025 | 01:16 AM
ఆదివారం వేకువనుంచి మధ్యాహ్నం వరకు 27,525 మంది భక్తులకు శ్రీవారి దర్శనం చేయించి క్యూలైన్లను మూసివేశారు. ఏకాంత సేవ నిర్వహించి తలుపులు మూసివేశారు. వెంగమాంబ అన్నప్రసాద భవనం, లడ్డూ కౌంటర్లూ మూతపడ్డాయి. వీటిని సోమవారం ఉదయం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. అన్నప్రసాద కేంద్రాల మూత నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ముందుగానే 50 వేల పులిహోర ప్యాకెట్లను వితరణ చేశారు.
చంద్రగ్రహణం: ఆదివారం రాత్రి 9.50 నుంచి సోమవారం వేకువజామున 1.31 గంటల వరకు
శ్రీవారి ఆలయం మూతపడింది: మధ్యాహ్నం 3.30 గంటలు
తిరిగి తెరచుకునేది: సోమవారం వేకువజాము 3 గంటలకు
ఆదివారం వేకువనుంచి మధ్యాహ్నం వరకు 27,525 మంది భక్తులకు శ్రీవారి దర్శనం చేయించి క్యూలైన్లను మూసివేశారు. ఏకాంత సేవ నిర్వహించి తలుపులు మూసివేశారు. వెంగమాంబ అన్నప్రసాద భవనం, లడ్డూ కౌంటర్లూ మూతపడ్డాయి. వీటిని సోమవారం ఉదయం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. అన్నప్రసాద కేంద్రాల మూత నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ముందుగానే 50 వేల పులిహోర ప్యాకెట్లను వితరణ చేశారు. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం మధ్యాహ్నం 2.15 గంటలకు మూతపడింది. అలాగే, తిరిగి టీటీడీకి చెందిన సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీనివాస ఆలయం, ఉపాలయాల ద్వారాలను అధికారులు మూసివేశారు. సోమవారం ఉదయం తిరిగి ఆలయాన్ని తెరచి శుద్ధి, సంప్రోక్షణ తరువాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి