చట్టం తన పని తాను చేసుకుపోతుంది
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:49 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసినట్లు.. ఇప్పుడూ అరాచకాలు చేయాలనుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
వైసీపీ అరాచకాలపై మంత్రి నాదెండ్ల
రేణిగుంట, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసినట్లు.. ఇప్పుడూ అరాచకాలు చేయాలనుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అన్నమయ్య జిల్లా కోడూరులో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లేందుకు ఆయన సోమవారం మధ్యాహ్నం తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిలో వైసీపీ చేసిన అరాచకాలు ప్రజలందరికీ తెలుసన్నారు. దళిత యువకుడిపై దాడిని రాష్ట్రమంతా చూసిందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు మంత్రికి స్వాగతం పలికారు.