Share News

పలమనేరు చేరుకున్న కుంకీలు

ABN , Publish Date - May 22 , 2025 | 02:04 AM

చిత్తూరు జిల్లాలో మద గజాలను కట్టడి చేసేందుకు కర్ణాటక నుంచి బయల్దేరిన 4కుంకీ ఏనుగులు బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పలమనేరు చేరుకొన్నాయి.

పలమనేరు చేరుకున్న కుంకీలు

పలమనేరు, మే 21 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో మద గజాలను కట్టడి చేసేందుకు కర్ణాటక నుంచి బయల్దేరిన 4కుంకీ ఏనుగులు బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పలమనేరు చేరుకొన్నాయి.ఒక్కో ఏనుగును ఒక్కో లారీలో తీసుకువచ్చారు. పలమనేరు చేరుకొన్న కుంకీ ఏనుగులను ముసలిమడుగు వద్ద సిద్ధం చేసిన ఎలిఫెంట్‌ క్యాంప్‌ ప్రాంతానికి తరలించారు.దాదాపు మూడున్నర దశాబ్డాలుగా ఏనుగులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలను నాశనం చేయడంతో పాటు రైతులను సైతం తొక్కి చంపి వేసిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.ఈ నేపథ్యంలో శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల సాయంతో మదగజాల పనిబట్టాలని అటవీశాఖ నిర్ణయించింది. ఏనుగులు అటవీ సరిహద్దు గ్రామాల వద్దకు వచ్చినప్పుడు కుంకీ ఏనుగుల సాయంతో వాటిని లోతట్టుప్రాంతాలకు తరిమివేయడంతో పాటు ఒంటరిగా తిరుగుతున్న ఏనుగులను ఈ ఎలిఫెంట్‌ క్యాంప్‌ ప్రాంతానికి కుంకీల సాయంతో తీసుకువచ్చి బంధించేందుకు క్రాల్స్‌ కూడా సిద్ధం చేశారు.

Updated Date - May 22 , 2025 | 02:04 AM