ముగిసిన కల్యాణ వెంకన్న పవిత్రోత్సవాలు
ABN , Publish Date - Oct 20 , 2025 | 02:17 AM
శ్రీనివాసమగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం రాత్రి పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా వేకువ జామున స్వామివారిని సుఫ్రభాత సేవతో మేల్కొలిపి, తోమాల, కొలువు నిర్వహించారు. అనంతరం యాగశాలలో వైదిక కైంకర్యాలు జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లను కల్యాణ మండపంలో కొలువు దీర్చి సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉత్సవర్లకు ఆస్థానం నిర్వహించారు. 7 గంటల నుంచి 8 గంటల వరకు యాగశాల వైదిక కైంకర్యములు, పూర్ణాహుతి, కుంభప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. కార్యక్రమాలలో జేఈవో వరబ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, అర్చకులు బాలాజీరంగాచార్యులు, శేషాధ్రిచార్యులు, నారాయణాచార్యులు, పార్థసారఽధి, సూపరింటెండెంట్లు రాజ్‌కుమార్, రమే్‌షకుమార్, ఇన్స్‌స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
చంద్రగిరి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): శ్రీనివాసమగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం రాత్రి పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా వేకువ జామున స్వామివారిని సుఫ్రభాత సేవతో మేల్కొలిపి, తోమాల, కొలువు నిర్వహించారు. అనంతరం యాగశాలలో వైదిక కైంకర్యాలు జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లను కల్యాణ మండపంలో కొలువు దీర్చి సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉత్సవర్లకు ఆస్థానం నిర్వహించారు. 7 గంటల నుంచి 8 గంటల వరకు యాగశాల వైదిక కైంకర్యములు, పూర్ణాహుతి, కుంభప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. కార్యక్రమాలలో జేఈవో వరబ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, అర్చకులు బాలాజీరంగాచార్యులు, శేషాధ్రిచార్యులు, నారాయణాచార్యులు, పార్థసారఽధి, సూపరింటెండెంట్లు రాజ్‌కుమార్, రమే్‌షకుమార్, ఇన్స్‌స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.