రిసెప్షన్‌కు రాని పెళ్లికొడుకు
ABN , Publish Date - Oct 24 , 2025 | 01:09 AM
రిసెప్షన్‌కు పెళ్లికొడుకు రాకపోవడంతో వధువు బంధువులు పోలీసు స్టేషన్‌కు పరుగులు తీసిన ఘటన ఇది. పాకాల మండలం దామలచెరువు పంచాయతీ పచ్చిపాలపల్లెకు చెందిన యువతికి బంగారుపాళ్యానికి చెందిన వఽరుడితో నిశ్చితార్థమయింది.
- పోలీసులను ఆశ్రయించిన వధువు బంధువులు
పాకాల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రిసెప్షన్‌కు పెళ్లికొడుకు రాకపోవడంతో వధువు బంధువులు పోలీసు స్టేషన్‌కు పరుగులు తీసిన ఘటన ఇది. పాకాల మండలం దామలచెరువు పంచాయతీ పచ్చిపాలపల్లెకు చెందిన యువతికి బంగారుపాళ్యానికి చెందిన వఽరుడితో నిశ్చితార్థమయింది. గురువారం సాయంత్రం పాకాల సమీపంలోని ఆనందగిరి ఆలయ కళ్యాణ మండపంలో రిసెప్షన్, శుక్రవారం ఉదయం 9-10 గంటల నడుమ కల్యాణం జరగాల్సి ఉంది. రిసెప్షన్ వేడుకకు వధువు సిద్ధమై ఎదురు చూస్తుండగా వరుడు రాలేదు. దీంతో ఆందోళన చెందిన వధువు బంధువులు పెళ్లి కొడుకు కోసం గాలిస్తున్నారు. పాకాల పోలీసులను కూడా ఆశ్రయించారు.