రేపు గవర్నర్ రాక
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:55 AM
తిరుపతికి మంగళవారం ఉదయం 11.35 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్నారు. తిరుచానూరులోని తాజ్ హోటల్‌లో బస చేస్తారు.
ఎల్లుండి రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న అబ్దుల్ నజీర్
తిరుపతి(కలెక్టరేట్), డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): తిరుపతికి మంగళవారం ఉదయం 11.35 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్నారు. తిరుచానూరులోని తాజ్ హోటల్‌లో బస చేస్తారు. వేలూరులోని శ్రీపురంలో గోల్డెన్ టెంపుల్ దర్శనానికి బుధవారం ఉదయం 10.15గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆమెకు గవర్నర్, రాష్ట్ర మంత్రి సవిత స్వాగతం పలకనున్నారు. హెలికాప్టర్‌లో వెళ్లి గోల్డెన్ టెంపుల్ దర్శించుకుని మధ్యాహ్నం 1.15 గంటలకు తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకుని, 1.25గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరనున్నారు.