ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అడుగులు వేయాలి
ABN , Publish Date - Sep 08 , 2025 | 01:30 AM
‘ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. గత ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేయడంతో కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తున్నారు. అటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు దసరా కానుకగా డీఏ మంజూరు చేయాలి’ అని ఏపీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు.
తిరుపతి(వైద్యం), సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. గత ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేయడంతో కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తున్నారు. అటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు దసరా కానుకగా డీఏ మంజూరు చేయాలి’ అని ఏపీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని ఏపీఎన్జీవోస్ భవనంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలవుతున్నా ఉద్యోగులు తమ బకాయిల, ఇతర సమస్యల విషయంలో ఎలాంటి ఒత్తిడి చేయకుండా ఎదురు చూస్తున్నారన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు న్యాయం జరిగేలా తక్షణమే కొత్త కమిషన్ వేయాలన్నారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.30 కోట్ల వరకు ఉద్యోగుల బకాయిలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫోరంను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ వివరించారు. అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి నేతలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం జిల్లా అడహాక్ కమిటీ చైర్మన్‌గా సురే్‌షబాబు, కోకన్వీనర్‌గా రఘు, కోశాధికారిగా లలితకుమార్, ఉపాధ్యక్షుడిగా శ్రావణ్‌కుమార్, సభ్యులుగా చెంచురత్నం, ఫణీంద్ర, జనార్దనయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జగదీశ్వరరావు, ఉపాధ్యక్షుడు ప్రసాద్ యాదవ్, కడప, నెల్లూరు జిల్లాల అధ్యక్షులు శ్రీనివాసులు, పెంచల్‌రావు, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, తిరుపతి తాలూకా అధ్యక్షుడు సురే్‌షబాబు, కార్యదర్శి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.