Share News

ఇంటికో ఇండస్ర్టియలిస్టు లక్ష్యం

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:54 AM

ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.చిత్తూరు రూరల్‌ మండలం ఫైవ్‌ వెంకటాపురంలోని 68 ఎకరాల్లో రూ.14.30కోట్లతో తలపెట్టిన ఇండస్ట్రియల్‌ పార్కుకు మంగళవారం ఆయన వర్చువల్‌గా భూమిపూజ చేశారు.

 ఇంటికో ఇండస్ర్టియలిస్టు లక్ష్యం
కుప్పంలో సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని వీక్షిస్తున్న ఎమ్మెల్సీ , టీడీపీ నేతలు

ఎంఎ్‌సఎంఈ పార్కుల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు

చిత్తూరు రూరల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.చిత్తూరు రూరల్‌ మండలం ఫైవ్‌ వెంకటాపురంలోని 68 ఎకరాల్లో రూ.14.30కోట్లతో తలపెట్టిన ఇండస్ట్రియల్‌ పార్కుకు మంగళవారం ఆయన వర్చువల్‌గా భూమిపూజ చేశారు.అలాగే పుంగనూరు మండలం చదళ్ల గ్రామంలో 21.80 ఎకరాల విస్తీర్ణంలో రూ.9.50 కోట్ల వ్యయంతో ఒక ఇండస్ట్రియల్‌ పార్కుకు, నగరి మండలం మాంగాడు గ్రామంలో రూ.17.30 కోట్ల వ్యయంతో 20 ఎకరాల్లో మరో పార్కుకు,కుప్పం మండలం పాలార్లపల్లెలో రూ.206.16 లక్షలతో ఐదెకరాల్లో ఎఫ్‌ఎ్‌ఫసీ(ఫ్లోటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌) పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని పారిశ్రామికవేత్తలుగా యువత ఎదగాలన్నారు.ఈ సందర్భంగా చిత్తూరుకు చెందిన మైథిలి అనే మహిళ మాట్లాడుతూ ఆర్‌జే రిఫైనరీ పేరుతో వేస్ట్‌ ఆయిల్‌ను రీసైక్లింగ్‌ చేసే పరిశ్రమను జీడీనెల్లూరులోని ఏపీఐఐసీ పార్కులో ఏర్పాటు చేసేందుకు ఏప్రిల్‌ నెలలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు.ప్రభుత్వం నెలలోపు మంజూరు చేయగా, పరిశ్రమ పనులు ప్రారంభించడం జరిగిందన్న ఆమె ప్రభుత్వ సహకారం మర్చిపోనన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 20 మందికి పరోక్షంగా 20 మందికి జీవనోపాధి కల్పించనున్నామని వివరించారు. ఈ సందర్భంగా మైథిలిని సీఎం చంద్రబాబు అభినందించారు.కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌,చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌, చుడా చైర్‌పర్సన్‌ హేమలత, మేయర్‌ అముద, శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, ఎంఎ్‌సఎంఈ డైరెక్టర్‌ ఎన్‌.మురళీమోహన్‌, చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌, నాయకులు చంద్రప్రకాష్‌, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.నగరిలో ఎమ్మెల్యే భానుప్రకాష్‌, కుప్పంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్‌, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, పీఎంకే హుడా చైర్మన్‌ సురే్‌షబాబు, పుంగనూరులో టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 12:54 AM