Share News

నిరంతర విద్యుత్‌ సరఫరానే లక్ష్యం

ABN , Publish Date - Dec 22 , 2025 | 02:16 AM

నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరానే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. రైతులకు 9గంటల నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు.

నిరంతర విద్యుత్‌ సరఫరానే లక్ష్యం
విజేతలకు బహుమతులిస్తున్న మంత్రి రవికుమార్‌, ఎమ్మెల్యేలు నాని, విజయశ్రీ, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

తిరుపతి(ఆటోనగర్‌), డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరానే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. రైతులకు 9గంటల నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన ఎగ్జిబిషన్‌ను మంత్రి ఆదివారం సందర్శంచారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు ఇంధన పరిరక్షణ అంశంపై పోటీలు నిర్వహించడం మంచి కార్యక్రమమని డిస్కం సీఎండీ శివశంకర్‌ను అభినందించారు. పీఎం కుసుమ్‌ పథకంలో భాగంగా సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పీఎం సూర్యాఘర్‌ పథకం కింద 20 లక్షల గృహ వినియోగదారులకు రూఫ్‌టాప్‌ సోలార్‌ సిస్టం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు పులివర్తి నాని, నెలవల విజయశ్రీ, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ జి.నరసింహయాదవ్‌, ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్లు పి.అయూబ్‌ఖాన్‌, కె.గురవయ్య, కె.రామ్మోహనరావు, సీజీఎంలు, జీఎంలు, ఎస్‌ఈలు, ఈఈలు, డీవైఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 02:16 AM