అలిపిరి పాదాల మండపానికి పూర్వ వైభవం
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:17 AM
అలిపిరిలో కూలిపోయే స్థితిలోవున్న పాదాల మండపం ప్రాచీనవైభవం చెక్కుచెదరకుండా పునర్నిర్మాణానికి తొలి అడుగు పడింది. గురువారం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎ్‌సఐ) అధికారుల బృందం దీనిని పరిశీలించింది. ప్రత్యేక శ్రద్ధతో, శ్రాస్తీయ పద్ధతిలో అవే రాళ్లు, స్తంభాలు వినియోగించే మండపాన్ని పునర్నించవచ్చని ఏఎ్‌సఐ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి ఆధ్వర్యంలోని బృందం అభిప్రాయపడింది.
తిరుమల, నవంబరు13(ఆంధ్రజ్యోతి): అలిపిరిలో కూలిపోయే స్థితిలోవున్న పాదాల మండపం ప్రాచీనవైభవం చెక్కుచెదరకుండా పునర్నిర్మాణానికి తొలి అడుగు పడింది. గురువారం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎ్‌సఐ) అధికారుల బృందం దీనిని పరిశీలించింది. ప్రత్యేక శ్రద్ధతో, శ్రాస్తీయ పద్ధతిలో అవే రాళ్లు, స్తంభాలు వినియోగించే మండపాన్ని పునర్నించవచ్చని ఏఎ్‌సఐ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి ఆధ్వర్యంలోని బృందం అభిప్రాయపడింది. ఇందుకు రూ. 4కోట్లు వ్యయం కావచ్చని అంచనా వేశారు. పూణేకు చెందిన లార్డ్ వేంకటేశ్వర ఛారిటబుల్ అండ్ రిలీజియస్స్ ట్రస్టు నిర్వాహుకులు వెంకటేశ్వరరావు ఈ మొత్తం భరించేందుకు ముందుకు వచ్చారు. శ్రీకాళహస్తిలో రూ.7 కోట్లతో లీకేజీ పనులు, సింహాచలం, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో మరమ్మతు పనులను పురాతన పద్ధతిలో ఇప్పటికే వీరి ఆధ్వర్యంలో జరిగాయి. పాదాలమండపాన్ని పరిశీలించిన ఏఎ్‌సఐ బృందంలో బెంగుళూరు డిప్యూటీ ఇంజినీర్ జీ శ్రీనివాసులు, హైదరాబాద్ డిప్యూటీ ఇంజినీర్ కృష్ణచైతన్య కూడా ఉన్నారు. 450 ఏళ్ల క్రితం విజయనగర రాజుల కాలంలో పాదాలమండపాన్ని నిర్మించారు. పదేహేనేళ్లుగా రాళ్లు, పైపెచ్చులు, గోడలు పడిపోతూ ప్రమాదకరంగా మారింది. దీని స్థానంలో కొత్తది నిర్మించాలా, మరమ్మతులు చేయాలా అనే చర్చ జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అధికారులు ఆర్కియాలజీ విభాగం సంప్రతించడంతో ఈ బృందం తిరుపతికి వచ్చింది.
ఒక్క ఇటుకా కదిలించం
పాదాల మండపాన్ని పూర్తిగా కూలదోసి కొత్తది కడతారనే ప్రచారం నిజం కాదు. ప్రస్తుతం ఉన్న నిర్మాణంలోంచి ఒక్క ఇటుకను కూడా కదిలించబోము. ఇందులోని ప్రతీ రాయినీ, స్తంభాన్నీ యధాతధంగా వినియోగించుకుంటాం. వాటిపై నెంబర్లు వేసి తిరిగి వాటితోనే నిర్మాణం జరుగుతుంది. దాతకూడా ముందుకువచ్చారు. విధివిధానాలు పూర్తికాగానే పనులు ప్రారంభిస్తాం. పనులు పూర్తయితే మరో 700 ఏళ్ల దాకా అలిపిరి పాదాలమండపానికి ముప్పు ఉండదు.
- మునిరత్నంరెడ్డి, ఏఎ్‌సఐ డైరెక్టర్