Share News

నెరవేరనున్న పేదల సొంతింటి కల

ABN , Publish Date - May 20 , 2025 | 02:25 AM

కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో 42,347 మంది తనకు సొంతంగా స్థలముందని, కొత్తగా పక్కా గృహాన్ని మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 22,534, అంటే 53.21 శాతం దరఖాస్తుల్ని తహసీల్దార్‌ ఆధ్వర్యంలో ఆమోదించారు. ఇంటి నిర్మాణం కోసం ఆయా స్థలాలకు అనుమతులిచ్చారు. ఇంకా 19,813 దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఆమోదించిన దరఖాస్తులను హౌసింగ్‌ అధికారులు కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్లోడ్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి అప్రూవల్‌ వచ్చాక నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చు. నిర్మాణ వ్యయం భారీగా పెంపు గతంలో పీఎం ఆవాస్‌ యోజన 1.0 అమలైతే.. తాజాగా 2.0ను అమలు చేస్తున్నారు. ఇందులో కేంద్రం తన వాటాను రూ.1.50 లక్షల నుంచి రూ.2.35 లక్షల వరకు పెంచుతున్నట్లు పేర్కొంది. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.లక్ష వాటా వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు. ఈ ప్రకటనలు ఉత్తర్వుల రూపంలో అమల్లోకి వస్తే ఒక్కో లబ్ధిదారుడికి రూ.3.35 లక్షల వరకు సాయం చేకూరుతుంది. ఈ సాయం మరింత పెరిగే అవకాశాలూ ఉన్నాయి. 2.0లో లబ్ధిదారులు యూనిట్‌ కాస్ట్‌కు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు అదనంగా ఖర్చు చేసుకుంటే సొంతింటి కల సాకారమవుతుంది.

నెరవేరనున్న పేదల సొంతింటి కల
రామకుప్పం- ఆవులకుప్పం మధ్యనున్న పిల్లిగుట్టల్ని చదును చేసి ఇచ్చిన స్థలాల్లో ఒక్క ఇళ్లూ నిర్మించని లబ్ధిదారులు

  • కొత్త ప్రభుత్వంపై నమ్మకంతో ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు

  • యూనిట్‌ కాస్ట్‌ కూడా పెంచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

  • ఇప్పటికే 42వేల మంది లబ్ధిదారుల ఎదురుచూపులు

  • కొత్త రేషన్‌కార్డులిచ్చాక మరో 20వేల దరఖాస్తులొచ్చే అవకాశం

పేదల సొంతింటి కల నెరవేరనుంది. ఇళ్లు లేని పేదలు కూడా కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తన వాటా పెంచుతూ ప్రకటించగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్మాణానికి తన వంతు సాయం అందిస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలో పెద్దఎత్తున ఇంటి నిర్మాణానికి దరఖాస్తులు వచ్చాయి.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో 42,347 మంది తనకు సొంతంగా స్థలముందని, కొత్తగా పక్కా గృహాన్ని మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 22,534, అంటే 53.21 శాతం దరఖాస్తుల్ని తహసీల్దార్‌ ఆధ్వర్యంలో ఆమోదించారు. ఇంటి నిర్మాణం కోసం ఆయా స్థలాలకు అనుమతులిచ్చారు. ఇంకా 19,813 దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఆమోదించిన దరఖాస్తులను హౌసింగ్‌ అధికారులు కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్లోడ్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి అప్రూవల్‌ వచ్చాక నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చు.

నిర్మాణ వ్యయం భారీగా పెంపు

గతంలో పీఎం ఆవాస్‌ యోజన 1.0 అమలైతే.. తాజాగా 2.0ను అమలు చేస్తున్నారు. ఇందులో కేంద్రం తన వాటాను రూ.1.50 లక్షల నుంచి రూ.2.35 లక్షల వరకు పెంచుతున్నట్లు పేర్కొంది. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.లక్ష వాటా వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు. ఈ ప్రకటనలు ఉత్తర్వుల రూపంలో అమల్లోకి వస్తే ఒక్కో లబ్ధిదారుడికి రూ.3.35 లక్షల వరకు సాయం చేకూరుతుంది. ఈ సాయం మరింత పెరిగే అవకాశాలూ ఉన్నాయి. 2.0లో లబ్ధిదారులు యూనిట్‌ కాస్ట్‌కు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు అదనంగా ఖర్చు చేసుకుంటే సొంతింటి కల సాకారమవుతుంది.

గత లబ్ధిదారులకూ అవకాశం..?

ఇంటి పట్టాలు ఊర్లకు దూరంగా ఉండడం, యూనిట్‌ కాస్ట్‌ సరిపోకపోవడంతో లబ్ధిదారులు ఆసక్తి చూపించడం లేదని అప్పట్లో అధికారులు బలవంతంగా గ్రౌండింగ్‌ చేయించారు. దీంతో లబ్ధిదారులు కూడా చాలావరకు పునాదులు తవ్వేసి వదిలేశారు. 73,584 గృహాల్లో 50 శాతమే స్లాబ్‌ వరకు వెళ్లాయి. మిగిలినవి ఆయా దశల్లో ఆగిపోయాయి. ఇలా మన జిల్లాలో సుమారు 9వేల మంది పునాదులు నిర్మించుకుని వదిలేశారు. వారందరికీ పీఎం ఆవాస్‌ యోజన 2.0 కింద అవకాశం ఇచ్చేందుకు పైస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంగా మరో రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవచ్చు.

రేషన్‌కార్డులు కొత్తవి వచ్చాక..

ప్రస్తుతం ప్రభుత్వం రేషన్‌కార్డుల్లో మార్పుచేర్పులు, కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ అవకాశం కోసం ఏళ్లుగా వేచి ప్రజలు పెద్దఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 42 వేల మంది ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే.. కొత్త రేషన్‌కార్డులు వచ్చాక మరో 20 వేల మంది నుంచి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

వైసీపీ హయాంలో జరిగిందిదీ..

వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో జిల్లాకు కేంద్ర ప్రభుత్వం 73,584 గృహాలను మంజూరు చేసింది. ఒక్కో గృహానికి కేంద్రమే రూ.1.50 లక్షల సాయం అందించింది. ఈ సాయం 2014-19 మధ్య టీడీపీ హయంలో రూ.2.50 లక్షలుగా ఉండేది. అప్పుడు కూడా కేంద్రం రూ.1.50 లక్షలే ఇచ్చినా, రాష్ట్రం తన వాటా కింద మరో రూ.లక్ష ఇచ్చేది. వైసీపీ ప్రభుత్వం తన వాటా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన రూ.1.50 లక్షలతోనే సరిపెట్టింది. ఆయా ప్రాంతాలకు జగనన్న కాలనీలని పేరు కూడా పెట్టుకుంది. దీంతోపాటు ఇచ్చిన పట్టాలు ఊరికి దూరంగా కొండల్లో, గుట్టల్లో ఉండడం మరో ప్రధాన కారణం. దీంతో చాలామంది ఇళ్లను నిర్మించుకోవడానికి ఆసక్తి చూపించలేదు.

Updated Date - May 20 , 2025 | 02:25 AM