పింఛన్ల పంపిణీలో జిల్లాకు ప్రథమ స్థానం
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:34 AM
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలో తిరుపతి జిల్లాకు ప్రథమస్థానం దక్కింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు.. 2,63,350మందికి గాను 2,49,025మందికి (94.56 శాతం) పింఛన్లు పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, ఏపీడీ ప్రభావతి తెలిపారు.
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలో తిరుపతి జిల్లాకు ప్రథమస్థానం దక్కింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు.. 2,63,350మందికి గాను 2,49,025మందికి (94.56 శాతం) పింఛన్లు పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, ఏపీడీ ప్రభావతి తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా, పింఛన్ల పంపిణీలో జిల్లా ప్రఽథమ స్థానంలో నిలవడంతో అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని కలెక్టర్ వెంకటేశ్వర్ అభినందించారు.
- తిరుపతి(కలెక్టరేట్), ఆంధ్రజ్యోతి