Share News

కౌండిన్యను వణికిస్తున్న చలిపులి

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:37 AM

కుప్పం నియోజకవర్గం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం సరిహద్దు గ్రామాలతోపాటు పట్టణాలను చలిపులి వణికిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

కౌండిన్యను వణికిస్తున్న చలిపులి
89పెద్దూరులో పొలాల్లో కురుస్తున్న పొగమంచు

రామకుప్పం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజకవర్గం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం సరిహద్దు గ్రామాలతోపాటు పట్టణాలను చలిపులి వణికిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వారం రోజులుగా చలితీవ్రత పెరుగుతోంది. తెల్లవారుజాము 4 నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కురుస్తోంది. సాయంత్రం నాలుగు గంటలకే తిరిగి మంచు ప్రతాపం చూపుతోంది. ఉదయం, సాయంత్రం జనం చలికి వణిపోతున్నారు. ఉదయం 8 గంటలకు కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. పగటిపూట సైతం చలిగాలులు వీస్తుండటంతో సాధ్యమైనంత వరకు ఎండలో ఉంటున్నారు. సాయంత్రం 5గంటలకే ఇళ్లకు చేరుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలకే పట్టణాలు, గ్రామాల్లోని వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.

Updated Date - Dec 15 , 2025 | 01:37 AM