Share News

తీరం.. అల్లకల్లోలం

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:17 AM

అల్లకల్లోలంగా సముద్రతీరం

తీరం.. అల్లకల్లోలం
తూపిలిపాళెం సముద్రతీరంలో ఎగిసిపడుతున్న అలలు

అల్పపీడన ప్రభావంతో ఆదివారం వాకాడు మండలం తూపిలిపాళెం సముద్రతీరం అల్లకల్లోలంగా మారడంతో అలలు ఎగిసిపడుతున్నాయి. వాకాడు, కోట, చిల్లకూరు సముద్రతీరంలో తీరంలో 3 మీటర్ల ఎత్తున కెరటాలు ఎగిసిపడుతున్నాయి. 5 మీటర్లు ముందుకు సముద్రం చొచ్చుకొనిరావడంతో మత్స్యకారులు వేటకు వెళ్లలేదు. సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో మూడు రోజులు వేట కొనసాగించలేని పరిస్థితి నెలకొందని మత్స్యకారులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం 6.30 నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది.

- వాకాడు, ఆంధ్రజ్యోతి

Updated Date - Aug 11 , 2025 | 12:17 AM