Share News

చెలిమిచేను జలపాత సోయగాలు

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:43 AM

రామకుప్పం మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కౌండిన్య అభయారణ్యంలో జలపాతాలు హోరెత్తుతున్నాయి. ననియాలతాండా, రామాపురంతాండా, వీర్నమల, బల్ల అటవీప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో చెలిమిచేను, బడాలగట్టు జలపాతాలు కనువిందు చేస్తున్నాయి.

చెలిమిచేను జలపాత సోయగాలు
జలసోయగాలతో చెలిమిచేను జలపాతం

రామకుప్పం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కౌండిన్య అభయారణ్యంలో జలపాతాలు హోరెత్తుతున్నాయి. ననియాలతాండా, రామాపురంతాండా, వీర్నమల, బల్ల అటవీప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో చెలిమిచేను, బడాలగట్టు జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. చెలిమిచేను జలపాతం పైభాగంలో బండరాళ్లను చీల్చుకుంటూ జలాలు ఉధృతంగా కిందకు జాలువారుతున్నాయి. అక్కడి నుంచి చుట్టూ పచ్చనికొండల మీదుగా సుమారు 150 అడుగుల కిందకు హోరు శబ్దం మధ్య జలాలు దూకుతున్నాయి.చెలిమిచేను, బడాగట్టు జలపాతాలకు వెళ్లేందుకు ఉన్న దారులను రహదారులుగా మార్చి, జలపాతాల వద్ద రక్షణ ఏర్పాట్లు చేస్తే ఈ ప్రాంతం పర్యాటకులకు అనువుగా ఉంటుంది. జలపాతాల నుంచి జాలు వారే జలాలు తమిళనాడుకు వృఽథాగా పోతున్నాయి. జలపాతాల దిగువ భాగాల్లో భారీ చెక్‌డ్యాంలు నిర్మించి జలాలను నిలువరిస్తే అటవీ ప్రాంతంతోపాటు ఆరేడు పంచాయతీల్లో భూగర్భజలాలు వృద్ధి చెందుతాయి.

Updated Date - Aug 09 , 2025 | 01:43 AM