కేర్ టేకరే హంతకుడు
ABN , Publish Date - Aug 22 , 2025 | 03:04 AM
పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తికి అతడు కేర్ టేకర్. ఏడాదిగా ఆ ఇంట్లో వాళ్లతో బాగా ఉంటూ, నమ్మకం పెంచుకున్నాడు. ఎనిమిది గ్రాముల కమ్మల కోసం ఆ ఇంట్లోని వృద్ధురాలిని హతమార్చాడు రవి.
8 గ్రాముల కమ్మల కోసం వృద్ధురాలి హత్య
నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తికి అతడు కేర్ టేకర్. ఏడాదిగా ఆ ఇంట్లో వాళ్లతో బాగా ఉంటూ, నమ్మకం పెంచుకున్నాడు. ఎనిమిది గ్రాముల కమ్మల కోసం ఆ ఇంట్లోని వృద్ధురాలిని హతమార్చాడు రవి. ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. తిరుపతికి చెందిన షణ్ముగం కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారు. ఇతడి కుమారుడు శివ ఆనంద్ హైదరాబాదులో సాప్ట్‌వేర్ ఇంజనీర్. తన తండ్రి కోసం ఇటీవల తిరుపతి- రేణిగుంట రోడ్డులోని సీపీఆర్ విల్లా్‌సలో ఒక ప్లాటు కొన్నారు. తండ్రికి కేర్ టేకర్ కోసం విజయవాడలోని ఒక ఏజెన్సీని సంప్రదించారు. విజయవాడ సమీపంలోని తిరువూరుకు చెందిన రవిని ఆ ఏజెన్సీ ఏడాది క్రితం ఎంపిక చేసి తిరుపతికి పంపింది. ప్రతినెలా రవికి రూ.24,000 జీతం చెల్లిస్తుండగా, ఇందులో ఏజెన్సీ రూ 9,000 పట్టుకుని 15,000 ఇచ్చేవారు. ఈ జీతం చాలదని రవి ఆగిపోవడంతో.. శివ ఆనంద్ నేరుగా అతడినే సంప్రదించి నెలకు రూ.22 వేల జీతం ఇస్తామని ఒ్పిపంచారు. అప్పటి నుంచి షణ్ముగంకు అవసరమైన సేవలు చేస్తున్నాడు. షణ్ముగం సోదరి ధనలక్ష్మి కూడా కొంతకాలంగా వీరితో ఉంటున్నారు. కాగా, వర్కు ఫ్రం హోం చేస్తున్న శివ ఆనంద్‌కు కంపెనీ నుంచి ఫోన్ చేసి హైదరాబాదులోని మీటింగ్‌కు రావాలని పిలిచారు. దీంతో బుధవారం సాయంత్రం అతడు వెళ్లిపోయారు. ఆ రాత్రి దివానాపై నిద్రిస్తున్న శివ ఆనంద్ మేనత్త ధనలక్ష్మి(73) చెవిలో ఉన్న దాదాపు 8 గ్రాముల బంగారు కమ్మలు కాజేయాలనే దురాశతో రవి ఆమె హత్యకు పథకం వేశాడు. అర్ధరాత్రి సమయంలో ఆమె గొంతుకోసి బంగారు కమ్మలు లాక్కొన్నాడు. తాను ధరించిన దుస్తులు అక్కడే మరో దుస్తులు వేసుకుని పరారయ్యాడు. గురువారం ఉదయం ఇంటికొచ్చిన పనిమనిషి బుజ్జమ్మ.. అక్కడి దృశ్యాన్ని చూసి ఆందోళన చెందారు. వెంటనే శివ ఆనంద్‌కు ఫోన్ చేసి చెప్పగా.. అతడు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ భక్తవత్సలం, సీఐ రాంకిషోర్, ఎస్‌ఐలు నాగార్జునరెడ్డి, లోకే్‌షబాబు, వేలి ముద్రల నిపుణులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లో పనిచేస్తున్న కేర్ టేకర్ ఈ హత్యకు ఒడి గట్టినట్లు సీసీ పుటేజీల ద్వారా గమనించారు. రక్తం మరకలున్న రవి దుస్తులను సీజ్ చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.