మూడోసారీ కొట్టుకుపోయిన వంతెన
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:54 AM
నగరి నుంచి కీళపట్టుకు వెళ్లే మార్గంలో కుశస్థలీ నదిపై ఉన్న లోతట్టు వంతెన ముచ్చటగా మూడోసారి శనివారం కొట్టుకుపోయింది. కృష్ణాపురం రిజర్వాయర్‌లో నీరు అధికం కావడంతో నీటిని కిందకు విడుదల చేశారు. దీంతో నదిలో వరద ఉధృతి ఎక్కువై నదిపై ఉన్న లోతట్టు వంతెన కొట్టుకుపోయింది.
నగరి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): నగరి నుంచి కీళపట్టుకు వెళ్లే మార్గంలో కుశస్థలీ నదిపై ఉన్న లోతట్టు వంతెన ముచ్చటగా మూడోసారి శనివారం కొట్టుకుపోయింది. కృష్ణాపురం రిజర్వాయర్‌లో నీరు అధికం కావడంతో నీటిని కిందకు విడుదల చేశారు. దీంతో నదిలో వరద ఉధృతి ఎక్కువై నదిపై ఉన్న లోతట్టు వంతెన కొట్టుకుపోయింది. వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఇకనైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.