Share News

గూడూరు ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి

ABN , Publish Date - Dec 27 , 2025 | 01:30 AM

గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని, లేని పక్షంలో జిల్లాగా ప్రకటించాలన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ కన్వీనర్‌ దశరధరామిరెడ్డి అన్నారు.

గూడూరు ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి
దీక్షా శిబిరంలో జేఏసీ నాయకులు

గూడూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని, లేని పక్షంలో జిల్లాగా ప్రకటించాలన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ కన్వీనర్‌ దశరధరామిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక టవర్‌ క్లాక్‌ కేంద్రం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్ష 20వ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మెగా ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, ముత్యాలపేట వ్యాపారస్థులు దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. గూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పూల చంద్రశేఖర్‌, డాక్టర్‌ రామకృష్ణ, సుబ్బరామరాజు, బ్రహ్మయ్య, వేమయ్య, గౌస్‌బాషా, ఫయాజ్‌, శ్రీనివాసులు తదిరులు పాల్గొన్నారు. చిట్టమూరు మండలం కొత్తగుంట సెంటర్లో జేఏసీ నాయకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా సాధనే తమ లక్ష్యమంటూ నినదించారు. గంటపాటు కొత్తగుంట సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. జేఏసీ కన్వీనర్‌ జనార్దన్‌, సెక్రటరీ మీజూరు మాదవ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మల్లి, పాల మళ్లికార్జున్‌ రావు, మోహన్‌ సాయి. పనబాక హేమంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 01:30 AM