Share News

థ్యాంక్యూ సీఎం సార్‌

ABN , Publish Date - Dec 31 , 2025 | 01:30 AM

నెల్లూరు జిల్లాలో కలపాలనే గూడూరు ప్రజల ఆకాంక్షను సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ నెరవేర్చారని ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ అన్నారు.

థ్యాంక్యూ సీఎం సార్‌
టవర్‌క్లాక్‌సెంటర్‌ వద్ద సంబరాలు జరుపుకుంటున్న ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, టీడీపీ నాయకులు

గూడూరులో సంబరాలు

గూడూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలో కలపాలనే గూడూరు ప్రజల ఆకాంక్షను సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ నెరవేర్చారని ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ అన్నారు. గూడూరు, చిల్లకూరు, కోట మండలాలను నెల్లూరు జిల్లాలో కలుపుతూ తుది నోటిఫికేషన్‌ విడుదల కావడంతో గూడూరులో మంగళవారం సంబరాలు చేసుకున్నారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎమ్మెల్యే పాశిం సునీల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు, విద్యార్థులు, స్థానికులు, జేఏసీ నేతలు పోటుపాళెం కూడలి వద్ద సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ కటౌట్లకు డ్రోన్ల సాయంతో పాలాభిషేకం చేశారు. టవర్‌క్లాక్‌సెంటర్‌ వద్ద జేఏసీ నాయకులు 24వ రోజు నిర్వహిస్తున్న రిలేదీక్షా శిబిరంకు ఎమ్మెల్యే చేరుకుని నాయకులకు పండ్లరసం అందజేసి దీక్షలను విరమింపజేశారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. థ్యాంక్యూ సీఎం సార్‌, థ్యాంక్యూ లోకేశ్‌ సార్‌ అంటూ ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. సీఎం, మంత్రులు సీఎం లోకేశ్‌, నారాయణ, రాంనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శీలం కిరణ్‌కుమార్‌, నెలబల్లి భాస్కర్‌రెడ్డి, పులిమి శ్రీనివాసులు, ఆరికట్ల మస్తాన్‌నాయుడు, అబ్దుల్‌రహీం, బిల్లు చెంచురామయ్య, దుద్దా రాఘవరెడ్డి, మట్టం శ్రావణి, కరుణాకర్‌రెడ్డి, ఎల్లసిరి శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వర్లురాజు, దువ్వూరు రాజశేఖర్‌రెడ్డి, చిల్లకూరు పట్టాభిరామిరెడ్డి, పెంచలయ్య, లీలావతి, భారతి, శ్రీధర్‌, విద్యార్థులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 01:30 AM